2009 వ సంవత్సరంలో వచ్చిన 'అవతార్' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 13 ఏళ్ల క్రితమే ఈ సినిమా వేల కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా  దాదాపు 3 బిలియన్ డాలర్ల దాకా వసూళ్లు రాబట్టి ఇప్పటికీ చెక్కు చెదరని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఇక ఆ మూవీకి సీక్వెల్ గా 'అవతార్ 2′(అవతార్ ది వే ఆఫ్ వాటర్) కూడా రాబోతున్నట్టు ప్రకటన వచ్చినప్పటి నుండి సినిమా పై తారా స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రపంచం మొత్తం కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన ఈ సినిమా డిసెంబర్ 16 వ తేదీన చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.దాదాపు 400 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ ను ఒక రేంజిలో ఫిదా చేస్తుంది అనే చెప్పాలి. మొదటి రోజు కొంత మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ జనం ఎగబడి ఈ చిత్రాన్ని చూశారు.


ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే.. 'అవతార్ 2' (అవతార్ ది వే ఆఫ్ వాటర్) సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా ఏరియాల్లో కూడా రెంటల్ బేసిస్ మీద ఓన్ రిలీజ్ చేసుకున్నారు. దీంతో మొత్తం రూ.5.25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఏకంగా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన సంగతి తెలిసిందే.ఇక ఫుల్ రన్ ముగిసేసరికి రూ.60.74 కోట్ల భారీ షేర్ ని ఈ సినిమా కలెక్ట్ చేసింది.దీంతో తెలుగు బయ్యర్లకి ఏకంగా రూ.55.49 కోట్ల భారీ లాభాలను అందించి డబ్బింగ్ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2.2 బిలియన్ డాలర్లు వసూళ్లు చేసినట్టు సమాచారం. 50 రోజుల్లో ఈ రేంజ్ వసూళ్ల దక్కాయంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: