టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలతో బిజీ బిజీగా ఉండడమే కాదు మరోవైపు ఆహా ఓటీటిగా అన్ స్టాపబుల్ అనే టాక్ షో తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు అని చెప్పాలి. బాలకృష్ణ అంటే ఎప్పుడు సీరియస్ గానే ఉంటాడు అనే ఒక భావన ఒకప్పుడు అభిమానుల్లో ఉండేది. కానీ ఇక అన్ స్టాపబుల్ కార్యక్రమం ప్రసారమైన తర్వాత బాలకృష్ణలో ఇంత చిలిపితనం దాగి ఉందా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అయితే మొదటి సీజన్కు మించి ప్రస్తుతం రెండవ సీజన్ అదిరిపోయే రేటింగ్ సంపాదిస్తూ దూసుకుపోతుంది.


 ఇక ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోలు, రాజకీయ నాయకులు సైతం బాలయ్య అన్ స్టాపబుల్ కార్యక్రమంలో సందడి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అయితే ఆహా కి భారీగా లాభాలు తెచ్చిపెడుతుంది అని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు ఎంతో మంది యువ హీరోలను.. స్టార్ హీరోలను తన షోకి పిలిచి తనదైన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు బాలయ్య. ఇక కొంతమంది రాజకీయ నాయకులను కూడా పిలిచాడు అన్న విషయం తెలిసిందే. అయితే అందరినీ పిలిచి బాలయ్య తన స్నేహితులని పక్కన పెట్టాడు అనేది తెలుస్తుంది.


 తన స్నేహితులు ఎవరో కాదు బాలయ్యతో పాటుగా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా కొనసాగుతున్న నాగార్జున, వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి. ఇక బాలయ్య తోటి హీరోలు అయినా ఈ ముగ్గురు ఇప్పటివరకు అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరు అవ్వలేదు. అయితే బాలయ్య ఈ ముగ్గురు హీరోలను తన షోకి పిలవడం లేదా.. లేక దా బాలయ్య పిలిచిన ఈ ముగ్గురు అన్ స్టాపబుల్ కి రావడానికి ఇష్టపడటం లేదా అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. . ఏది ఏమైనా ఇక బాలయ్య తన స్నేహితులనే షోకి పిలువలేకపోతున్నాడు అన్న టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: