టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహం తో పొంగి పోతున్నారు. రామ్ చరణ్ ను చూసి తండ్రి గా ఆయన గర్వ పడుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. రామ్ చరణ్ చేసిన ఆర్ఆర్ఆర్ సంచలన విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.

మూవీ దర్శక ధీరుడు రాజమౌళి తెర కెక్కించిన ఈ భారీ విజయాన్ని అందుకోవడమే కాదు ఆ మూవీ తెలుగు స్థాయి ని పెంచేసింది. ప్రపంచవ్యాప్తం గా ఆర్ఆర్ఆర్ ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. తారక్ కొమురం భీమ్ గా,చరణ్ అల్లూరి సీతా రామరాజు గా వారి వారి స్టైల్ లో అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమా పై హాలీవుడ్ దర్శకులు సైతం ప్రశం సలు కురిపించారు.వారిలో ఒకరైన దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ ను ప్రశంసించారు. అలాగే నటీ నటులను పొగడ్తల తో ముంచెత్తారు.

ఈ మధ్యనే జేమ్స్ కెమరూన్ మాట్లా డుతూ రామ్ చరణ్ చేసిన నటన ను అభినందించారు. చరణ్ అద్భుతం గా నటించాడని ఆయన కు అతని పాత్ర ఎంతగా నో ఆకట్టుకుందని అన్నారు. అలాగే రాజమౌళి ఆర్ఆర్ఆర్ ను తెరకెక్కించిన విధానం మరియు విజవల్స్, మ్యూజిక్ అన్ని చాలా బాగున్నాయని  అన్నారు.

అదే విధం గా ఆర్ఆర్ఆర్ మూవీ చూస్తుంటే ఆర్ఆర్ఆర్ లోని రోల్స్, విజువల్ ఎఫెక్స్ట్ ను చూసిన తర్వాత షేక్ స్పియర్ క్లాసిక్ గుర్తు కొచ్చిందని కేమరూన్ అన్నారు. ఐతే వాటిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ రామ్ చరణ్ ఈ స్థాయి కి ఎదిగాడా అని తండ్రి గా నేను చాలా గర్వ పడుతున్నానని ఈ ప్రశంసల ఎదుట  ఆస్కార్ కూడా చిన్నదే అని తన మనోభావాన్ని చెప్పకనే చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: