ఇక ఇలా సిద్ధార్థ నడిపిన ప్రేమ వ్యవహారాలు ఎన్నో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు మరో హీరోయిన్ తో లవ్ రిలేషన్షిప్ లో ఉన్నాడు. అదితి రావు హైదరితో చట్టపట్టలేసుకొని తిరుగుతూ ఉన్నాడు అని చెప్పాలి. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు రావడం మొదలయ్యాయి. ఇక మొన్నటికి మొన్న శర్వానంద్ పెళ్లిలో కూడా ఈ ఇద్దరు కలిసి హాజరయ్యారు. అయితే వీరిద్దరూ లవ్ లో ఉన్నారని వార్తలు రావడం తప్ప వీరిద్దరూ ఎక్కడ క్లారిటీ ఇచ్చింది లేదు.
కాగా వీరిద్దరూ గతంలో మహాసముద్రం అనే సినిమాలో జోడిగా నటించారు. ఇక ఆ సమయంలోనే వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది అన్నది తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల వీరి మధ్య ప్రేమ ఉంది అనే విషయంపై వీరిద్దరూ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు అన్నది తెలుస్తుంది. ఇటీవలే అదితి రావు హైదరి సిద్ధార్థ తో కలిసి డాన్స్ చేస్తున్న వీడియో తన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. వీడియోని స్వయంగా అదితి రావు హైదరి షేర్ చేసింది అని చెప్పాలి. దీంతో ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిందని అందరూ అనుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి