ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక అంతకు ముందు మాత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బిగ్ హిట్ అందుకున్నాడు. అయితే ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అన్నది కూడా అటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే మెగాస్టార్ తో పూరి జగన్నాథ్ ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు కూడా తెర మీదకి వచ్చాయి. ప్రత్యేకంగా మెగాస్టార్ ఇంటికి పిలిపించుకుని మరి పూరికి ఆఫర్ ఇచ్చినట్లు టాక్ వినిపించింది. ఇక ప్రస్తుతం పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి మరో వార్త తెరమీదకి వచ్చింది.
ఒక యంగ్ మాస్ హీరోతో పూరి జగన్నా సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడట. అతను ఎవరో కాదు ఇప్పుడు తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ బ్యాగ్రౌండ్ లేకుండా మంచి హీరోగా ఎదుగుతున్న విశ్వక్సేన్. ఇటీవల దాస్ కా దమ్ కి సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాడు విశ్వక్సేన్. ఇక స్టార్ దర్శకులతో వర్క్ చేయాలని అనుకుంటున్నాడట ఈ యంగ్ హీరో. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ తో ఒక హై వోల్టేజ్ సినిమాలు చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కూడా కలుసుకుని కథ గురించి ఇప్పటికే చర్చలు జరిపినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక మరికొన్ని రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి