మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలోనే అన్నకు తగ్గ తమ్ముడిగా పేరు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ లో ఉన్న హీరోలు అందరికీ కూడా అభిమానులు ఉంటే.. అటు ఒక పవర్ స్టార్ కి మాత్రం భక్తులు ఉంటారు అని చెప్పాలి. మిగతా హీరోలతో పోల్చి చూస్తే చేసిన సినిమాలు తక్కువే అయినా.. ఇక అందులో హిట్ సాధించినవి కూడా మరింత తక్కువ. అయినప్పటికీ సినిమాలతో సంబంధం లేకుండా అటు పవన్ కళ్యాణ్ ను అభిమానిస్తూ ఉంటారు ఎంతోమంది ప్రేక్షకులు.


 ఆయన సినిమాలు చూసి అభిమానులుగా మారిన వారి కంటే ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఫాన్స్ గా మారిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నప్పటికీ.. జనాలకు ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని పెట్టి జనంలోకి కదిలారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనకడుగు వేయకుండా జనం తరపున పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే అటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ అందుతుంది అన్న విషయం తెలిసిందే.



 అయితే పవన్ జనసేన పార్టీకి మద్దతు అందించడం గురించి మేఘ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరూపాక్ష ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే జనసేన పార్టీకి మీ మద్దతు ఎంత ఉంటుంది అంటూ ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఒక కార్యకర్తగా ఎంత సపోర్ట్ చేయాలో అంత చేస్తా. నాకు పాలిటిక్స్ గురించి తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ మామయ్య పోటీ చేస్తున్నారు కాబట్టి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది అంటూ సాయి ధరం తేజ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: