కానీ వయసులో తమ కంటే పెద్ద హీరోయిన్లతో హీరోలు రొమాన్స్ చేసిన సందర్భాలు మాత్రం ఇండస్ట్రీలో చాలా అరదు. కానీ అటు నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇక ఇలాగే తనకంటే వయసులో పెద్దది అయినా హీరోయిన్ తో ఒక మూవీలో రొమాన్స్ చేశాడు అని చెప్పాలి. ఆ హీరోయిన్ ఎవరో కాదు భూమిక. ఎన్టీఆర్,భూమిక తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం ఏదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే బ్లాక్బస్టర్ మూవీగా నిలిచింది.. అంతేకాదు ఎన్టీఆర్ ని ఒక్కసారిగా మాస్ హీరోగా మార్చేసింది.
ఈ సినిమాలో భూమికతో పాటు అంకిత మరో హీరోయిన్గా నటించింది. 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించిన భూమిక తారక్ కంటే వయసులో పెద్దది. వీరిద్దరి మధ్య దాదాపు 5 ఏళ్ళ గ్యాప్ ఉంది. అయితే సాంబ సినిమాలో కూడా ఎన్టీఆర్, భూమిక మరోసారి రొమాన్స్ చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఏది ఏమైనా ఇలా ఎన్టీఆర్ మాత్రం తనకంటే వయసులో పెద్దది అయిన హీరోయిన్ తో రొమాన్స్ చేసి టాలీవుడ్ లో ఏ హీరో చేయని సాహసం చేసి రికార్డు కొట్టాడు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి