హీరో సాయి ధరంతేజ్ ఇటీవల నటించిన విరూపాక్ష సినిమా ఎంతటి విజయాన్ని అందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా గత నెల 21వ తేదీన విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇతర భాషలలో సైతం విడుదల చేయడం జరిగింది. దీంతో డీసెంట్గా ఈ సినిమా రూ .100 కోట్ల క్లబ్లో చేరింది. ఇక గత వీకెండ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదల ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించారు.. అయితే ఈ సినిమాకు స్క్రీన్ ప్లే ని మాత్రం సుకుమార్ గారి అందించడం జరిగింది.


మొదట కార్తీక్ దండు అనుకున్న కథకు సుకుమార్ చాలా మార్పులు చేశారట. ఈ విషయాన్ని తానే స్వయంగా తెలియజేయడం జరిగింది కార్తీక్ దండు.. ఈ సినిమాలో శ్యామల పార్వతి అనే పాత్రలో నటించింది ఆమె హీరోకి అక్కలాంటి పాత్రను పోషించింది చెవిపోటుతో చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఒక్కసారిగా అనుమాదాస్పదంగా ఈ పాత్ర చనిపోతుంది చివరిలో హీరోయిన్ సంయుక్త మీనన్ విలన్ అన్నట్టుగా చూపించారు. అయితే మొదట నటి శ్యామల పాత్రని విలన్ గా చూపించాలనుకున్నారట డైరెక్టర్ కార్తీక్.


ఇటీవల ఈ విషయాన్ని కూడా రివిల్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయినందుకు ఈ విషయాన్ని ఆనంద పడుతూ తెలిపారు కార్తీక్. తాను అనుకున్న కథ మారిపోయింది అంటూ తెలియజేయడం జరిగింది. గతంలో కూడా భీమ్లా నాయక్ సినిమాకి స్క్రీన్ ప్లే అందించిన త్రివిక్రమ్ సైతం తనకు నచ్చినట్టుగా కథ  ను మార్చి సినిమాను తెరకెక్కించారు. సీనియర్ డైరెక్టర్లు కాబట్టి వారు ఎలా చెబితే అలా చేయాలి తప్పదు అంటూ అయిష్టంగానే అయినా సరే చేయాల్సిందే అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కార్తీక్ దండు తదుపరిచిత్రం ఇంకా సెట్ కాలేదు. కాబట్టి తన తదుపరి చిత్రం కోసం చాలామంది హీరోలు వెయిట్ చేస్తున్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: