ఈ మధ్యకాలంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినీ సెలబ్రిటీల విడాకులకు సంబంధించిన వార్తలు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొని ఇక ప్రేక్షకులందరికీ క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న వారు.. ఆ తర్వాత మాత్రం ఎవరు ఊహించని విధంగా చివరికి విడాకులు తీసుకుని వేరుపడుతున్నారు అనే విషయం తెలిసిందే. గతంలో సమంత, నాగచైతన్య విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఏం మాయ చేసావే సినిమాతో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం చివరికి పెళ్లి వరకు వెళ్ళింది.


ఇరు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఒప్పుకోవడంతో బంధు మిత్రులందరికీ సమక్షంలో ఎంతో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. ఏకంగా నాగచైతన్య, సమంత వివాహం గోవాలో జరగగా ఎంతోమంది అతిరథ మహారధులు అక్కడికి వచ్చారు. అయితే ఇక వీరిద్దరూ తర్వాత కాలంలో టాలీవుడ్లో క్యూట్ కపుల్ గా కూడా పేరు సంపాదించుకున్నారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో చివరికి వీరిద్దరూ విడాకులు తీసుకుని వేరుపడ్డారు. ఇప్పటికీ వీరు విడిపోవడానికి గల అసలు కారణమేంటి అన్న విషయంపై ఎవరికి క్లారిటీ లేదు. అయితే సమంత, నాగచైతన్య విడాకుల గురించి మరిచిపోక ముందే అంతలోనే మరో విడాకుల అంశం హాట్ టాపిక్ గా మారింది.



 గత కొంతకాలం నుంచి మెగా డాటర్ నిహారిక - చైతన్య విడాకులు తీసుకుంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇవి కేవలం వార్తలు మాత్రమే అని అందరూ అనుకున్నారు. కానీ ఇటీవల ఈ విషయంపై అందరికీ క్లారిటీ వచ్చేసింది. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్లో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న మెగా డేటా నిహారిక- చైతన్య జంట ఇటీవల పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అయితే ఈ ఇద్దరు ఎందుకు విడాకులు తీసుకున్నారు అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఇక నిహారిక చైతన్య విడాకుల తర్వాత టాలీవుడ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ అస్సలు కలిసి రావట్లేదు అంటూ ఎంతో మంది చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: