టాలీవుడ్ లో వన్ అఫ్ ది బెస్ట్ జోడీస్ ప్రభాస్ అండ్ అనుష్కది. బిల్లాతో మొదలుకొని, మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2  చిత్రాలలో కలిసి నటించారు వీళ్లిద్దరు. ఈ ఇద్ధరి మధ్య  ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా మంచి కెమిస్ట్రీ ఉంటుంది. వీళ్లిద్దరి సాన్నిహిత్యం చూసి ఎవరికైనా వీళ్ళు ప్రేమలో ఉన్నారేమో అనే సందేహం రావడం సహజం. కానీ ఈ జంట మాత్రం ఈ మాటలను చాలాసార్లు కొట్టిపడేసారు. ఐతే తాజా సమాచారం ప్రకారం వీళ్లిద్దరు ప్రేమించుకోవడం నిజమేనని తెలుస్తోంది. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారట. మరి వీళ్ళని ఆపిందెవరు ?

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ తాను పెళ్లి తిరుపతిలోనే చేసుకుంటా అని అన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రభాస్ చేసిన  ఈ కామెంట్ వలన మల్లి అందరి దృష్టి అతని పెళ్లి వైపు మళ్లింది. ఐతే  నాలుగుపదుల వయసు దాటినా ఇంకా ప్రభాస్ పెళ్లిపీటలు ఎక్కకపోవడానికి కారణం ఏంటి అని తెగ ఆలోచిస్తుంటారు అతని అభిమానులు. దీనికి కారణం ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు గారట. ప్రభాస్, అనుష్క, ఒకరినొకరు ఇష్టపడ్డాక పెళ్లి అనుమతి కోసం పెద్దలదగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణం రాజుగారు వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోలేదట.

ప్రభాస్ పెళ్లే తన చివరి కోరిక అని అన్న కృష్ణం రాజు గారు ఇలా అడ్డుపడటానికి బలమైన కారణం కూడా ఉంది. దీనికి కారణం వీళ్లిద్దరి జాతకాలూ కలవకపోవడమే. అనుష్క జాతకంలో కుజ దోషం ఉందట. కాదని వీళ్లిద్దరికీ పెళ్లి చేసిన, ఎంతోకాలం కలిసి ఉండరని చెప్పారట జ్యోతిష్యులు. అందుకే ప్రభాస్, అనుష్కల పెళ్ళికి కృష్ణం రాజు ఒప్పుకోలేదట. అనుష్క కుటుంబం కూడా కృష్ణం రాజు నిర్ణయానికి వత్తాసు పలికారని సమాచారం.  ఇప్పుడు ప్రభాస్, కృతిసనన్ పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ రూమర్స్ని కొట్టిపడేసారు కృతి సనన్.

మరింత సమాచారం తెలుసుకోండి: