అయితే ఇప్పుడు ఆ ప్లాన్ మార్చుకుని మార్చిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు వచ్చే సంవత్సరం ఏప్రియల్ లో జరగబోతున్నాయి. దీనితో మార్చి నెల సమయానికి దేశంలోని వాతావరణం అంతా రాజకీయాలతో వేడెక్కిపోతుంది. ఇప్పుడు ఆవిషయాల పైనే ‘గేమ్ చేంజర్’ మూవీ దృష్టిపెట్టి ఆవాతావరణాన్ని తమ సినిమా కలక్షన్స్ కు అనుకూలంగా మార్చుకోవడానికి భారీ ప్లాన్ వేస్తున్నట్లు టాక్.
ఈమూవీ కథలో రాజకీయాల ప్రస్తావన చాలఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఈమూవీలో హీరో రామ్ చరణ్ అభ్యుదయ భావాలుగల ఐఎఎస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. అయితే కుళ్ళిపోయిన రాజకీయాలతో విసుకు చెంది తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలలోకి వచ్చి వ్యవస్థను బాగు చేయడానికి ఏమి చేశాడు అన్న కథతో ఈమూవీ ఉంటుంది కాబట్టి ఎన్నికల నాటి రాజకీయ వాతావరణం తమ సినిమాకు అన్ని విధాల కలిసి వస్తుందని ఈ మాష్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి నిజ జీవితంలో రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికలలో ‘జనసేన’ పార్టీని ఏదోవిధంగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి తీసుకు రావడానికి చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులలో రామ్ చరణ్ తన బాబాయ్ కి తన మూవీ ద్వారా పరోక్ష సహాయం చేస్తున్నాడు అనుకోవాలి. ఈమూవీలో చాల పవర్ ఫుల్ రాజకీయ డైలాగ్స్ ఉంటాయనే ప్రచారం జరుగుతోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి