ఇలా ఇన్నేళ్ల కెరియర్ లో తన తప్పులను తాను కరెక్ట్ చేసుకుంటూ ఎదుగుతూ వచ్చాడు అల్లు అర్జున్. పుష్ప సినిమాతో ఇక బన్నీ రేంజ్ ఏ లెవెల్ కు వెళ్లిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇక అల్లు అర్జున్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా చేసిన సినిమాలలో దేశముదురు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ చేసి అందరికీ సర్ ప్రైస్ ఇచ్చాడు. కాగా ఈ మూవీలో బన్నీ సరసన హన్సిక హీరోయిన్గా నటించింది. అయితే హన్సిక అల్లు అర్జున్ గురించి ఇటీవల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
అల్లు అర్జున్ తన సహనటులతో ఎంత సరదాగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే దేశముదురు ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన హన్సిక తో కూడా షూటింగ్ సమయంలో అంతే సరదాగా క్లోజ్ గా ఉండేవాడట అల్లు అర్జున్. అయితే ఓ రోజు హన్సిక ను బలవంతంగా పబ్బుకు తీసుకెళ్లడట. ఆ హీరోయిన్ వద్దు అన్న వినకుండా పబ్బుకి తీసుకెళ్లాడట. అయితే షూటింగ్ చేస్తున్న సమయంలోనే మధ్యలో హన్సిక బర్త్ డే రావడంతో డైరెక్టర్ పూరి ఇక హీరో బన్నీ ఇద్దరు కలిసి పబ్బుకి ఆమెను తీసుకువెళ్లి అక్కడ సెలబ్రేషన్స్ చేశారట. ఇక అక్కడ వేడి వేడి పాలు తాగించారట. పాలు మాత్రమే కాదు ఇతర డ్రింక్స్ కూడా బలవంతంగా తాగించారట. ఇక ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది హన్సిక.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి