ఫిలిమ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ అన్నది అందరు అంగీకరించే విషయం. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఒక హీరోయిన్ కి లేదా హీరోకి వరసగా ఫ్లాప్ వస్తే వారిపై ఐరన్ లెగ్ ముద్ర పడటం సర్వసాధారణం. ఒకప్పుడు ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన పూజా హెగ్డే పరిస్థితి ఇప్పుడు చూస్తే ఇండస్ట్రీలోని సెంటిమెంట్స్ ఏవిధంగా ప్రభావితం చేస్తాయో అర్థం అవుతుంది.
ఆమధ్య హరీష్ శంకర్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘గబ్బర్ సింగ్’ తాను తీస్తున్నప్పుడు తాను శృతి హాసన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినప్పుడు అదేవిధంగా అల్లు అర్జున్ తో ‘దువ్వాడ జాగన్నాధం’ తీసే సమయంలో పూజా హెగ్డే ను హీరోయిన్ గా పెట్టుకున్నప్పుడు తనను ఫ్లాప్ హీరోయిన్ లతో సినిమాలు తీస్తున్నావు ఏమిటి అంటూ చాలమంది తనను భయపెట్టిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే తనకు అలాంటి సెంటిమెంట్స్ లేవు అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమాను చేస్తున్న హరీష్ శంకర్ ఆసినిమాలో మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల ను ఎంపిక చేసి సెకండ్ హీరోయిన్ గా ‘ఏజెంట్’ ‘గాండీవధారి అర్జున’ సినిమాలో నటించిన సాక్షి వైద్యను ముందు ఎంపిక చేసి ఇప్పుడు ఆమె పై ఐరన్ లెగ్ బ్యూటీ ముద్ర పడటంతో ఆమెను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ నుండి తప్పిస్తున్నట్లు వార్తలు రావడంతో కొంతమంది హరీష్ శంకర్ ను టార్గెట్ చేస్తూ అతడికి కూడ సెంటిమెంట్స్ పెరిగిపోతున్నాయి అంటూ సెటైర్లు వేస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి