టీమిండియా మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వ్యాపారాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. నిర్మాణ సంస్థను ప్రారంభించి ఒక సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు మహేంద్రసింగ్ ధోని. లెట్స్ గెట్ మ్యారీడ్ అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ధోని ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సాక్షి ధోని ఈ సినిమాను నిర్మించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీలో లవ్ టు డే ఫేమ్ ఇవానా, హరీష్ కళ్యాణ్ జంటగా నటించారు.


 నదియా, యోగి బాబు తదితరులు కీలకపాత్రలో కనిపించారు అని చెప్పాలి. రమేష్ తమిళ్ మణి దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చింది ఈ మూవీ. అయితే ధోని నిర్మాణంలో వచ్చిన మూవీ కావడంతో ఈ సినిమాపై దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. ఇక భారీ అంచనాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది అని చెప్పాలి. జూలై 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన లెట్స్ గెట్ మ్యారీడ్ సినిమా తెలుగులో మాత్రం ఒక వారం ఆలస్యంగా ఆగస్టు 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రెండు చోట్ల నెగెటివ్ టాక్ తెచ్చుకొని ఫ్లాప్ గానే మిగిలిపోయింది.


 అయితే ఇక ఎంతో మంది థియేటర్ నిర్వాహకులు.. ఈ సినిమాను తక్కువ సమయం లోనే ఇక తమ థియేటర్ ల నుంచి తీసేసారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ధోని నిర్మించిన సినిమా కావడంతో కొంతమంది అభిమానులు మాత్రం ఇక ఈ సినిమా ఎప్పుడు ఓటీడీలో రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేశారు. అయితే ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేకుండానే.. లెట్స్ గెట్ మారీడ్ అనే సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది అన్నది తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కేవలం తమిళ్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు వర్షన్ ఇంకా రాలేదు. త్వరలోనే తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి రాబోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: