మెగా స్టార్ చిరంజీవి కి ఎప్పటి నుంచో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలని ఆలోచనలు చేస్తున్నాడు. అయితే రకరకాల కారణాలు వల్ల ఆమూవీ ప్రాజెక్టు ఆలోచనలు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాను చేస్తున్న త్రివిక్రమ్ ను ఈ సినిమా షూటింగ్ ను ఎట్టి పరిస్థితులలోను నవంబర్ లోపు పూర్తి చేసే విధంగా వ్యూహాలు రచిస్తున్నాడు.
ఈప్రయత్నాలకు మహేష్ బాబు నుండి కూడ పూర్తి సహకారం అందుతూ ఉండటంతో ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం పరుగులు తీస్తోంది. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిసెంబర్ మూడవ వారనికి పూర్తి చేసి ఆ డిసెంబర్ నుండి ఈమూవీ విడుదల తేదీ వరకు భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు రచిస్తున్నాడు అని అంటున్నారు.
ఈమూవీ తరువాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో మూవీ ప్రారంభం కావలసి ఉంది. అయితే ‘పుష్ప 2’ షూటింగ్ వచ్చే సంవత్సరం సమ్మర్ వరకు కొనసాగి ఆతరువాత ఆమూవీ విడుదల అయ్యే ఆగష్టు వరకు బన్నీ అందుబాటులో ఉందని నేపధ్యంలో ఈ గ్యాప్ లో చిరంజీవితో ఒక సినిమాను వేగంగా పూర్తి చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు రావడంతో చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని ఒక కుటుంబ కథా చిత్రం కోసం ఆలోచిస్తున్నట్లు టాక్.
ఈమూవీని నిర్మించేందుకు ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఇప్పటికే రెడీగా ఉన్న పరిస్థితులలో చిరంజీవి కోసం ఒక మచి కథను ఆలోచించే బాధ్యత త్రివిక్రమ్ తన టీమ్ కు అప్పచెప్పాడు అన్న మాటాలు వినిపిస్తున్నాయి. ‘అలా వైకుంఠ పురములో’ బ్లాక్ బష్టర్ హిట్ అయినప్పటికీ ఆ ఘన విజయాన్ని త్రివిక్రమ్ పూర్తిగా సద్వినియోగించుకోలేకపోయాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. మహేష్ తో సినిమాను తీసే విషయంలో కూడ కొన్ని కారణాలు వల్ల చాల ఆలస్యం అయిన నేపధ్యంలో ఇప్పుడు మరొక పొరపాటు మళ్ళీ జరగ కూడదని త్రివిక్రమ్ చిరంజీవి వైపు అడుగులు వేస్తున్నాడు అనుకోవాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి