ఇక ఈ సినిమా సూపర్ డూపర్ విజయం సాధించడంతో ఇక ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈ సంవత్సరం సంక్రాంతికి తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ తో వారసుడు అనే సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక తమిళ్లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు వంశీ పైడిపల్లి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతుంది అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు అని చెప్పాలి. ప్రస్తుతం ఒక మంచి కథ రాసుకునే పనిలో బిజీగా ఉన్నాడట.
అయితే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బృందావనం సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఇప్పుడు టీవీలలో వచ్చిన కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ముందుగా బృందావనం సినిమాని ఎన్టీఆర్ తో తీయాలని అనుకోలేదట వంశీ పైడిపల్లి. ఇక తనకు మహేష్ బాబు స్నేహితుడు కావడంతో మహేష్ తో సినిమా తీయాలని అనుకున్నాడట. ఆ టైంలో మహేష్ బాబు త్రివిక్రమ్ తో ఖలేజా సినిమాతో బిజీగా ఉన్నాడు. దీంతో బృందావనం సినిమా కోసం డేట్స్ కేటాయించలేకపోయాడు. దీంతో వంశీ పైడిపల్లి తారక్ తో సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాడట. ఇక ఆ తర్వాత బృందావనం వదులుకున్నందుకు వంశీ పైడిపల్లితో మహర్షి సినిమా చేశాడు మహేష్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి