అయితే ఆసినిమా విడుదలైన 17సంవత్సరాల గ్యాప్ తీసుకుని 2010లో ‘గాయం 2’ తీశారు. అయితే ఈసీక్వెల్ కు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించలేదు. కేవలం నిర్మాతగా వ్యవహరిస్తూ ఈమూవీని తన శిష్యుడు ప్రవీణ్ శ్రీ దర్శకత్వంలో నిర్మించి విడుదల చేశాడు. అయితే ఆమూవీ భారీ ఫ్లాప్ గా మారింది. ‘గాయం 2’ లో భయంకరమైన నేర సామ్రాజ్యపు ఫ్లాష్ బ్యాక్ ఉన్న హీరో దాన్ని వదిలేసి వేరే దేశంలో రెస్టారెంట్ పెట్టుకుని గొడవలకు దూరంగా బ్రతుకుతూ ఉంటాడు. అయితే ఏళ్ళ తరబడి అతన్ని వెతుకుతున్న శత్రువులకు అతడి జాడ తెలిశాక ఫ్యామిలీని లక్ష్యంగా పెట్టుకుని అతడిని టార్గెట్ చేస్తారు.
దీనితో రెచ్చిపోయిన ఆహీరో విలన్స్ ను అందర్నీ ఊచకోత కొస్తాడు. ఇప్పుడు ఈసినిమా ఛాయలు ‘లియో’ లో కూడ కనిపిస్తాయని టాక్. ఈమూవీ హీరో విజయ్ ఎక్కడో హిల్ స్టేషన్ లో హోటల్ పెట్టుకుని అందరికీ భయపడుతూ జీవిస్తూ ఉంటాడు. అయితే అజ్ఞాతవాసం చేస్తున్న అతడిని విలన్స్ వెతుక్కుంటూ వచ్చి విజయ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తే హీరో రెచ్చిపోయి వారందరినీ ఊచకోత కొస్తాడు అని తెలుస్తోంది.
ఈ రెండు కథలు ‘ఏ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్’ కు రీమేక్. ఆమూవీలో కూడ హీరో ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. దీనితో ‘లియో’ ‘గాయం 2’ నుండి స్పూర్తి పొందిందా లేదంటే హాలీవుడ్ సినిమాను మక్కీకి మక్కీ గా దింపారా అన్నవిషయం ‘లియో’ విడుదలైన తరువాత మాత్రమే తెలుస్తుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి