ఈసారి దసరా వార్ సినిమాలకు 200 కోట్ల స్థాయిలో బిజినెస్ జరగడంతో దసరా కు వస్తున్న అన్ని భారీ సినిమాలను ప్రేక్షకులు వరస పెట్టి చూస్తారా అన్నసందేహాలు కొందరకి వస్తున్నాయి. ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ వచ్చాక ఈమూవీ పై ఉన్న అంచనాలు అమాంతం రెట్టింపయ్యాయి. బాలయ్యని తెలంగాణ స్లాంగ్ తో సరికొత్త అవతారంలో అనీల్ రావిపూడి చూపించిన తీరు చాలామందికి బాగా నచ్చడంతో ఈమూవీ విడుదల కాకుండానే ఈమూవీ పై ప్రీ పాజిటివ్ టాక్ వచ్చేలా చేసింది.
ఇక విజయ్ నటించిన ‘లియో’ మూవీకి ప్రీ నెగటివ్ టాక్ కొనసాగుతూ ఉన్నప్పటికీ ఈమూవీ ఓపెనింగ్ కలక్షన్స్ అధిరిపోవడం ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా దర్శకుడు లోకేష్ కనకారాజ్ ఏదోఒక మ్యాజిక్ ఈమూవీలో చేసి ఉంటాడని విజయ్ అభిమానులు ఆశిస్తున్నారు. రవితేజా ‘టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ విడుదల తరువాత ఆమూవీ పై కూడ అంచనాలు పెరిగి పోయాయి.
అయితే దసరా సినిమాలు విడుదల అవుతున్న అక్టోబర్ 19న ఇండియా – బంగ్లాదేశ్వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ తరువాత అక్టోబర్ 21న ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది. ఈ రెండు మ్యాచ్ లు ఇండియన్ క్రికెట్ టీమ్ కు కీలకంగా మారడంతో ఈ రెండు మ్యాచ్ లను టివిలలో చూడటానికి యూత్ బాగా ఇష్టపడతారు. ఇలాంటి పరిస్థితులు వల్ల దసరా సినిమాల ఓపెనింగ్ కలక్షన్స్ దెబ్బతినే ఆస్కారం కొంతవరకు ఉండటంతో ఈ మూవీలను కొనుక్కున్న బయ్యర్లు టెన్షన్ పడుతున్నట్లు లీకులు వస్తున్నాయి. అయితే దసరా సెలవులు కాబట్టి యూత్ క్రికెట్ మ్యాచ్ లను కూడ యూత్ చూస్తారు అన్న అంచనాలు కూడ ఉన్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి