అనీల్ అనే యంగ్ డైరెక్టర్ ఈమూవీకి తయారు చేసిన స్క్రిప్ట్ అఖిల్ కు మొదట్లో నచ్చడంతో ఈమూవీ ప్రాజెక్ట్ కు ఓకె చేశాడు అని అంటారు. అయితే ‘ఏజెంట్’ ఘోరమైన ఫ్లాప్ అఖిల్ మనసును పూర్తిగా మార్చివేయడంతో ఇప్పుడు ఈమూవీ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడింది అన్నప్రచారం జరుగుతోంది. ఈమూవీ కథ కూడ పూర్తిగా యాక్షన్ డ్రామా కావడంతో మళ్ళీ ‘ఏజెంట్’ ఫలితం రిపీట్ అవుతుంది అన్నభయాలు అఖిల్ ను వెంటాడుతూ ఉండటంతో ఈమూవీ ప్రాజెక్ట్ ను పెండింగ్ లో పెట్టాడు అన్నప్రచారం జరుగుతోంది.
ఈపరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే సాయి ధరమ్ తేజ్ కు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కార్తీక్ దండు ఇప్పటికే తయారుచేసుకున్న ‘విరూపాక్ష 2’ మూవీ ప్రాజెక్ట్ లోకి సాయి ధరమ్ తేజ్ స్థానంలో అఖిల్ ను తీసుకోవడానికి చర్చలు జరుపుతున్నట్లు టాక్. ‘బ్రో’ మూవీ తరువాత తేజ్ తన అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా బయటపడటానికి కొన్ని నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకుంటున్న పరిస్థితులలో ‘విరూపాక్ష 2’ మూవీ ప్రాజెక్ట్ లోకి అఖిల్ ను తీసుకు రావడానికి గట్టి ప్రయత్నాలు కార్తీక్ దండు చేస్తున్నప్పటికీ ఈవిషయంలో అఖిల్ ఇప్పటికీ మౌనం వహిస్తూ ఉండటంతో ‘విరూపాక్ష 2’ ప్రాజెక్ట్ ఇంకా సస్పెన్స్ లోనే కొనసాగుతోంది అని అంటున్నారు.
ఈప్రయత్నాలు ఇలా కొనసాగుతూ ఉండగానే అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ గురించి నాగార్జున కొంతమంది బాలీవుడ్ దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. అఖిల్ ఇండటరీలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అతడికి చెప్పుకోతగ్గ సాలిడ్ హిట్ లేకపోవడం అక్కినేని కాంపౌండ్ ను కలవర పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి