

ఇటీవల ప్రియా తెలుగులో నటించిన ఇష్క్ సినిమా కూడా నిరాశపరిచింది.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రంలో ఈమె కీలకమైన పాత్రలో కూడా నటించింది. సరైన సినిమా పడితే తనని తాను ప్రూఫ్ చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ప్రియా వారియర్ సోషల్ మీడియాలో కూడా నిరంతరం గ్లామర్ షో తో రెచ్చిపోతూ ఉంటుంది. బికినీ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులను టెంట్ చేసేలా కనిపిస్తూ ఉంటుంది. దీంతో ఈమె షేర్ చేసే ఫోటోలను చూస్తే కచ్చితంగా ఈమె ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమే అనేంతలా కనిపిస్తూ ఉంటుంది.

తాజాగా ప్రియ వారియర్ మైండ్ బ్లోయింగ్ అయ్యే విధంగా ఫెస్టివల్ లుక్ లో అదరగొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. దసరా సందర్భంగా దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రుల పూజలు కొనసాగుతూ ఉన్నాయి.దీంతో పలువురు సెలబ్రిటీలు సైతం ముఖ్యంగా నటీమణులు పలు రకాల అందమైన దుస్తులలో ధరించి పండుగ వేళ అభిమానులను అలరిస్తున్నారు.
