‘సాహొ’ ఘోర పరాజయం చెందిన పవన్ కళ్యాణ్ సుజిత్ సమర్థత పై నమ్మకం పెట్టుకుని ‘ఓజీ’ సినిమా తీసే అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ ష్టర్ అవతారంలో మాఫియా కింగ్ గా కనిపించబోతున్న నేపధ్యంలో ఈమూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. మొదట్లో ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల అని  భావించారు.



అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా మారడంతో ‘ఓజీ’ సినిమాకు పవన్ డేట్స్ సమస్యగా మారింది. దీనితో సుజిత్ ఎంత పరుగులు తీసినా ఈమూవీ షూటింగ్ ఇంకా చాల పెండింగ్ ఉండటంతో ఈమూవీ విడుదలను వచ్చే సంవత్సరం సమ్మర్ కు వాయిదా వేశారు. అయితే లేటెస్ట్ గా సుజిత్ తన పుట్టినరోజు సందర్భంగా సోషల్   మీడియా లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.



‘ఓజి’ ని ఈ ఏడాది పేల్చి పారేద్దాం’ అంటూ సుజిత్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ చూసి చాలామంది షాక్ అవుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పై తన దృష్టిని అంతా పెట్టి ప్రస్తుతానికి సినిమాల విషయాలు మర్చి పోతున్నారు. దీనితో సుజిత్ కు పవన్ డేట్స్ ఇవ్వకుండా వ్యవహరిస్తే సుజిత్ ఎంతవరకు పవన్ తో తీస్తున్న ‘ఓజీ’ ని పేలుస్తాడు అంటూ కొందరు సోషల్ మీడియాలో సుజిత్ ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.



ఒకవేళ ఏదోవిధంగా సుజిత్ కు డేట్స్ విషయంలో పవన్ సహకరించినా ఇప్పటికే డిసెంబర్ మొదటివారంలో రాబోతున్న ‘హాయ్ నాన్న’ ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ ‘ఆపరేషన్ వాలెంటైన్’ నితిన్ ‘ఎక్స్ ట్రాడినరి మ్యాన్’ ప్రభాస్ ‘సలార్’ ల పరిస్థితి ఏమిటి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.  మరికొందరైతే సుజిత్ తన పుట్టినరోజు సందర్భంగా సరదాగా పెట్టిన పోస్ట్ కు పవన్ అభిమానులతో పాటు డిసెంబర్ లో విడుదల కాబోతున్న సినిమాల దర్శక నిర్మాతలు హీరోలు షాక్ అవుతున్నారు అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: