అయితే ఈపోటీని లెక్క చేయకుండా ఒక చిన్న తమిళ డబ్బింగ్ సినిమా ‘దీపావళి’ ఈ భారీ సినిమాల మధ్య విడుదల అవ్వడం అఅత్యంత షాకింగ్ గా మారింది. ‘బలగం’ రేంజ్ లో ఈమూవీ సక్సస్ అయి తీరుతుందని ఈమూవీ నిర్మాతలు గట్టి నమ్మకంలో ఉన్నారు. పల్లెటూరి నేపధ్యంలో ఉన్న ఈకథలో ప్రాణంగా చూసుకునే మనవడు అడిగిన కోరిక తీర్చడానికి తాతయ్య దగ్గర డబ్బులు ఉండవు. దీపావళి పండుగకు ఖరీదైన దుస్తులు కోరతాడు.
దీనితో తాత తన మనవడి కోరిక తీర్చడానికి ఎంత తిరిగినా అప్పు పుట్టదు. ఈపరిస్థితులలో అమ్మ వారికి బలి ఇద్దామని పెంచుకున్న మేకను అమ్మి తన మనవడి కోరిక తీరుద్దామని ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నాలలో భాగంగా ఒక మటన్ షాపు యజమాని ఆ మేకను కొనడానికి ముందుకు వస్తాడు. దీనితో సమస్య తీరింది అని తాత అనుకుంటే అనుకోకుండా ఆ మేకను దొంగలు ఎత్తుకు పోతారు. ఆ తర్వాత జరిగే నాటకీయ పరిణామాల మధ్య వీళ్ళ ప్రయాణం ఎలా గమ్యానికి చేరుకుంది అన్న పాయింట్ చుట్టూ తీయబడ్డ ఈమూవీలో మేక పాత్రకు సప్తగిరి వాయస్ ఓవర్ ఇచ్చాడు.
ఈసినిమా అంతా భావోద్వేగాల మధ్య అత్యంత సహజంగా ఉంటుంది కాబట్టి ‘బలగం’ స్థాయిలో తమ మూవీ హిట్ అయి తీరుతుందని నమ్మకంతో ఏకంగా సల్మాన్ ఖాన్ మూవీతో పోటీగా తమ ‘దీపావళి’ ని విడుదల చేస్తున్నారు. కొన్ని చిన్న సినిమాలు డబ్బింగ్ సినిమాలు అయినా పట్టించుకోకుండా అనూహ్య విజయాన్ని సాధిస్తున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో ‘దీపావళి’ చేరుతుందో లేదో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి