స్టార్ హీరోలకు చిన్న గుర్తింపు వచ్చినా అది ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ కి  పెద్ద న్యూస్ గా మారి భారీ స్థాయిలో సంబరాలు చేసుకోవడం పరిపాటిగా  మారింది. ఇలాంటి  విషయాలలో ఒకప్పుడు కేక్ కటింగ్  అన్నదానాలతో హడావిడి చేసే స్టార్ హీరోల అభిమానులు ఇప్పుడు తమ హడావిడి  అంతా సోషల్ మీడియాకు పరిమితం చేస్తున్నారు.ఇలాంటి హడావిడికి ఆర్ధిక వనరులు అవసరం లేకపోవడంతో మరింత  రెచ్చిపోయిన ఉత్సాహంతో హడావిడి చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం  జూనియర్ కు ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో చోటు దక్కడంతో  తారక్   అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసిన విషయం  తెలిసిందే. ఇప్పుడు ఆ గౌరవం రామ్ చరణ్ కు కూడా దక్కడంతో రామ్  చరణ్ అభిమానులు మరింత రెచ్చిపోతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.    వాస్తవానికి  ఈ ఎచ్చీవ్ మెంట్ తమ హీరోలకు ఆస్కార్ వచ్చినంత రేంజ్ లో చరణ్ జూనియర్ అభిమానులు ఫీల్ అవుతున్నారు అని  అనిపిస్తోంది అంటూ కామెంట్స్ కూడ వస్తున్నాయి. ఆస్కార్ అవార్డుల రేస్ లో ‘నాటు నాటు’ పాటకు అవార్డు వచ్చిన  తరువాత ఇండస్ట్రిలోని కొందరు ప్రముఖులు రాజమౌళి టీమ్  కు సత్కారం చేయాలని భావించినప్పుడు  ఆసత్కారాన్ని రాజమౌళి  సున్నితంగా తిరస్కరించాడు అన్న వార్తలు కూడా వచ్చాయి.    ఇప్పుడు చరణ్ తారక్ లు సాధించింది కూడ అంత  అద్భుతం అయితే   జక్కన్న తన ట్విట్టర్ లో కనీసం శుభాకాంక్షల రూపంలో అయినా  స్పందించాలి కదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈవిషయాలను పట్టించు కోకుండా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు ఎవరి సినిమాల పనులలో వారు బిజీగా ఉంటూ తాము తదుపరి నటించవలసిన సినిమాల కథల గురించి తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలై 18 నెలలు దాటిపోతున్న ఆసినిమాలో చరణ్ జూనియర్ ల నటన గురించీ ఇప్పటికీ వారి అభిమానులు సోషల్ మీడియాలో చర్చలు కొనసాగిస్తూనే ఉన్నారు..  మరింత సమాచారం తెలుసుకోండి: