నాగచైతన్య ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి 15సంవత్సరాలు దాటిపోయినా ఇంకా అతడి కెరియర్ విషయంలో స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. ‘100 పర్సెంట్ లవ్’ సినిమా రేంజ్ లో హిట్ అయిన సినిమాలు చైతూ కెరియర్ లో పెద్దగా ఏమీ లేవు. మాస్ హీరోగా మారాలని చైతూ ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ అతని సినిమాలు ఇప్పటికీ 50 కోట్ల గ్రాస్ ఫిగర్ ను దాటలేకపోయాయి అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి.



దీనికితోడు చైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ మూవీకి ప్రేక్షకులా నుండి మంచి స్పందన వచ్చినప్పటికీ ఆస్పందన కలక్షన్స్ రూపంలో కన్వర్ట్ కాలేదు అని ట్రేడ్ పండితుల భావన. ఆమధ్య విడుదలైన ‘లవ్ స్టోరీ’ సక్సస్ అయినప్పటికీ ఆతరువాత అతడు నటించిన చాలసినిమాలు ఫెయిల్ అవ్వడంతో చైతన్య కెరియర్ కూడ అంతంత మాత్రంగానే ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య చైతన్య నటిస్తున్న చైతన్య తన సినిమాల విషయంలో ఏదో ఒక అసంతృప్తి సగటు ప్రేక్షకులకు చైతూ సినిమాల పై ఉంది అన్న ప్రచారం కూడ ఉంది.



దీనితో ఈపరిస్థితుల మధ్య గీతా ఆర్ట్స్ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ మళ్ళీ రిపీట్ చేస్తూ మొదలు పెట్టబోతున్న చందూ మొండేటి గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న సినిమా పై నిర్మాతలు 100 కోట్ల బడ్జెట్ ను ఖర్చు పెడుతున్నారు అంటూ మీడియాలో వస్తున్న వార్తలను చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఇప్పటివరకు చైతన్య నటించిన ఏసినిమాకు 50 కోట్ల నెట్ కలక్షన్స్ రాని పరిస్థితులలో ఏధైర్యంతో చైతన్య నటిస్తున్న మూవీ పై 100 కోట్లు ఖర్చు పెడతారు అంటూ చాలామంది ఆశ్చర్య పడుతున్నారు.



గుజరాత్ లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారం తీసుకుని ఈమూవీ కథను వ్రాసినట్లు తెలుస్తోంది. ‘సముద్రం’ బ్యాక్ డ్రాప్ తో కనిపించే ఈసినిమాలో సహజత్వం కోసం శ్రీకాకుళం దగ్గారలోని సముద్ర ప్రాంతంలో ఈమూవీ ఘాట్ చేస్తారని టాక్. ఈసినిమా కోసం చైతన్య ఈసినిమా కోసం చైతన్య తన బాడీని బాగా పెంచినట్లు తెలుస్తోంది. సాయి పల్లవితో నాగచైతన్య కలిసి నటిస్తున్న ఈమూవీ షూటింగ్ పూర్తీ చేసుకుని విడుదల అవ్వడానికి వచ్చే సంవత్సరం సమ్మర్ వచ్చినా ఆశ్చర్యం లేదుఅంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: