సాధారణంగా భారీ సినిమాలకు సంబంధించిన ఓటీటీ సంస్థల బిజినెస్ డీల్ మూడు నెలల ముందుగానే పూర్తి అవుతుంది. అయితే ఈసారి సంక్రాంతి సినిమాలకు ప్రముఖ ఓటీటీ సంస్థలు పెడుతున్న కండిషన్స్ సంక్రాంతి భారీ సినిమాలు నిర్మిస్తున్న భారీ నిర్మాతలకు షాక్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తెలుస్తున్న సమాచారంమేరకు సంక్రాంతి భారీ సినిమాలను కొనబోతున్న ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ భారీ సినిమాలు ఒకవేళ అనుకోకుండా ఫెయిల్ అయితే తాము ఒప్పుకున్న ఎమౌంట్ లో 40 శాతం కోత పెడతామని ఒకవేళ భారీ సినిమాలు అంచనాల ప్రకారం సూపర్ హిట్ అయితే తాము అంగీకరించిన మొత్తం పూర్తిగా ఇస్తామని చెపుతూ ఒక కొత్త కండిషన్ నిర్మాతలకు ఎగ్రిమెంట్స్ లో పెడుతూ భారీ నిర్మాతలకు ఊహించని టెన్షన్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఓటీటీ సంస్థలు తాము కొనబోతున్న సంక్రాంతి సినిమాలకు మరొక కండిషన్ పెడుతున్నట్లు తెలుస్తోంది.
తాము కొనుక్కున్న సినిమాలు ఫ్లాప్ అయితే 15 రోజులు తరువాత వెంటనే స్ట్రీమింగ్ చేస్తామని ఒకవేళ సక్సస్ అయితే 30 రోజుల తరువాత స్ట్రీమింగ్ చేస్తామని పెడుతున్న మరో కొత్త కండిషన్ తో కన్ఫ్యూజ్ అవుతున్న నిర్మాతలు తమ సినిమాల బయ్యర్లను ఎలా ఒప్పించాలి అంటూ తలలు పట్టుకుంటున్నట్లు టాక్. ఒకవైపు భారీ సినిమాల నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితులలో ఈకొత్త ఓటీటీ సంస్థల నిబంధనలు అంగీకరిస్తే తాము ఇక భవిష్యత్ లో భారీ సినిమాలను తీయగలమా అంటూ మధనపడుతున్నట్లు తెలుస్తోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి