అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వం వహించిన ‘యానిమ‌ల్’ స్టార్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ కెరియర్ లో బెస్ట్ సూపర్ హిట్ మూవీగా మారుతుందనీ బాలీవుడ్ మీడియా అంచనాలు వేస్తోంది. దీనికికారణం ‘జవాన్’ ‘సలార్’ సినిమాలకు మించి ‘యానిమ‌ల్’ టీజ‌ర్ కి వచ్చిన రెస్పాన్స్ తో ఈ  అంచనాలు వేస్తున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టుగా ఈమూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీ  స్థాయిలో  విడుదల చేస్తున్నారు.



బాలీవుడ్  మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈమూవీని ‘జవాన్’ బ్రహ్మాస్త్రా చిత్రాలను మించిన  స్థాయిలో రికార్డు  థియేటర్ల సంఖ్యలో అమెరికా లో విడుదల చేస్తున్నారు. రణబీర్ కపూర్ రష్మిక ల  కాంబినేషన్ లో రూపొందిన  ఈమూవీ డిసెంబర్ 1న విడుదల కాబోతోంది.  2023లో విడుదలైన  భారీ సినిమాల రిలీజ్  ల’లో ఇది  ప్రధమ స్థానంలో ఉండబోతున్న పరిస్థితులలో హై యాక్టన్ ‘థ్రిల్లర్మూవీగా ‘యానిమ‌ల్’  వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్ రికార్డ్ ల‌ను క్రియేట్ చేసుందని అంచ‌నాలు  వేస్తున్నారు.



ఈమూవీ ఓవర్  సీస్ లో  ముఖ్యం గా అమెరికాలో  అత్యంత  భారీ  స్థాయిలో  విడుదల కాబోతోంది.  ఈచిత్రం ఉత్తర అమెరికాలో 888 కంటే ఎక్కువ స్క్రీన్‌లలో  విడుదల  చేస్తున్నారని ఈ సంఖ్య ‘జవాన్’ ‘బ్రహ్మాస్త్ర’ వంటి  భారీ  సినిమాల ధియేటర్స్ కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ‘జవాన్’ అమెరికాలో  850 స్క్రీన్లలో విడుదలైతె  బ్రహ్మాస్త్ర కేవలం 810 స్క్రీన్లలో మాత్ర‌మే విడుద‌ల చేశారు.   అమెరికాలోని అత్యధిక  ధియేటర్స్ లో విడుదల అయిన మూవీగా ‘యానిమల్' ఒక రికార్డ్ ను క్రియేట్ చేస్తోంది.  



ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ పాటలకు విపరీత మైన  స్పందన  రావడంతో  ఈమూవీ కలక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి రణబీర్ కపూర్ పాత్రకు ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరుగుతూ ఉంటే ప్రతినాయకుడి పాత్రలో బాబీ డియోల్ పాత్ర‌ ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అవుతుంది అంటున్నారు. క్రైమ్ డ్రామా జానర్‌ లో తీయబడ్డ ఈమూవీ రణబీర్ కపూర్ కెరియర్ లోనే భారీ హిట్ గా మారబోతోంది అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: