ప్రస్తుతం తమిళ ఫిలిమ్ ఇండస్ట్రీలో ‘మల్టీవర్స్’ హంగామా నడుస్తోంది. ఒక దర్శకుడు తాను తీసే సినిమాలోని కొన్ని సీన్స్ ను మరో సినిమాలోని కొన్ని సీన్స్ తో లింక్ చేసి ప్రేక్షకులకు సినిమా పై మరింత ఆశక్తి పెంచడానికి అనేకప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి ట్రెండ్ ను మొదలు పెట్టింది తమిళ దర్శకుడు లోకేష్ కనక రాజ్ ‘విక్రమ్’ సినిమాలో ‘ఖైదీ’ తో సహా తాను తీసిన మిగతా సినిమాలకు కూడా లింకులు పెట్టి ఆడియన్స్‌ కు మరింత ఆసక్తిని పెంచిన విషయం తెలిసిందే.ప్రస్తుతం లోకేష్ తీయబోయే కొత్త సినిమాలో కూడ ఇలాంటి లింకులు కనిపిస్తాయని ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘సలార్’ లోని కొన్ని సీన్స్ చూసే పరక్షకులకు ‘కేజీ ఎఫ్’ లోని సీన్స్ కనెక్ట్ అవుతాయని ప్రచారాం జరుగుతోంది. ఇప్పుడు ఈ ట్రెండ్ ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’ సినిమాలో అనుసరిస్తున్నట్లు వార్తలు గుప్పు మంటున్నాయి.లేటెస్ట్ గా ‘గుంటూరు కారం’ మూవీకి సంబంధించిన ‘దమ్ మసాలా’ పాటలోని దృశ్యాలను చూసిన వారికి ఆ పాటలోని దృశ్యాలు గతంలో త్రివిక్రమ్ తీసిన ‘అరవింద సమేత’ తో కనెక్ట్ అవుతాయా అంటూ కొందరు ఊహాగానాలు మొదలుపెట్టారు. ‘అరవింద సమేత’ లో శుభలేఖ సుధాకర్ రాజకీయ పార్టీ నేతగా కనిపించిన విషయం తెలిసిందే. ఆసినిమాలో అతడు ప్రాతినిధ్యం వహించే పార్టీ గుర్తు ‘కాగడా’ గాచూపించారు. ఇప్పుడు. ‘గుంటూరు కారం’ పాటలో కూడ రెండు చోట్ల కాగడా గుర్తు కనిపిస్తుంది.ఒక షాట్‌లో మహేష్ బాబు కారు మీద కూడా ఆ గుర్తు కనపడటంతో త్రివిక్రమ్ ఈసినిమాకు సంబంధించి ఖచ్చితంగా ‘మల్టీవర్స్’ ట్రెండ్ ను అనుసరిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో సరికొత్త ప్రచారం మొదలైంది. ‘అరవింద సమేత’ లో విలన్‌గా చేసిన జగపతిబాబు ‘గుంటూరు కారం’ లో కూడ నటిస్తూ ఉండటంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియాలో హడావిడి చేసే నెటిజన్స్ త్రివిక్రమ్ ‘మల్టీవర్స్’ ట్రెండ్ ను అనుసరిస్తున్నాడు అంటూ ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు..మరింత సమాచారం తెలుసుకోండి: