ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో వారసుల హంగామా బాగా కొనసాగుతోంది. అయితే సక్సస్ ఫుల్ దర్శకులు కాని అదేవిధంగా సక్సస్ ఫుల్ నిర్మాతలు కానీ తమ పిల్లలను హీరోలుగా తీసుకు వచ్చి సక్సస్ కొట్టాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అనేకసార్లు పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. అయితే దిల్ రాజ్ మాత్రం తన మేనల్లుడుని హీరోగా నిలబెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు పెద్దగా విజయవంతం కాలేదు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి.
దిల్ రాజ్ మేనల్లుడు ఆశిష్ రెడ్డిని హీరోగా సెటిల్ చేయడం కోసం దిల్ రాజ్ అనేక ప్రయోగాలు ఇప్పటికే చేశాడు. క్రేజీ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకుని ఆశిష్ రెడ్డి తో ‘రౌడీ బాయ్స్’ మూవీ చేసినప్పటికీ ఆసినిమా అంతంత మాత్రంగానే విజయవంతం అయింది. దీనితో దిల్ రాజ్ తన మేనల్లుడి కోసం మరో భారీ ప్రయత్నం చేస్తున్నాడు.
సుకుమార్ తో కథ రాయించి ఒక యంగ్ డైరెక్టర్ ను దర్శకుడుగా పెట్టి క్రేజీ హీరోయిన్స్ శ్రీలీల బేబి ఫేమ్ వైష్ణవి చతన్యల ను హీరోయిన్స్ గా పెట్టి ఒక యూత్ ఫుల్ ఫుల్ లవ్ స్టోరీని తీయడానికి దిల్ రాజ్ రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈసినిమాకు సంబంధించిన అధికారక ప్రకటన ఇంకా విడుదల కానప్పటికీ ఈమూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు చాల వేగంగా జరుగుతున్నాయి అంటున్నారు. అయితే ఇప్పటివరకు ఇండస్ట్రీలో నిర్మాతల కొడుకులు దర్శకుల వారసులు సక్సస్ ఫుల్ హీరోలుగా సెటిల్ అయిన సందర్భాలు లేవు అన్నకామెంట్స్ ఉన్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి