వరస పరాజయాలతో కూరుకుపోతున్న ఒక యంగ్ హీరో పై 100 కోట్లు పెట్టి ఒక సినిమా తీయడానికి ఎవరు సాహసించరు. అయితే అలాంటి సంఘటన అక్కినేని అఖిల్ విషయంలో జరగబోతోంది. ఆమధ్య విడుదలైన ‘ఏజెంట్’ ఘోర పరాజయం చందడంతో ఆమూవీని కొనుక్కున్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే.



దీనితో భవిష్యత్ లో అఖిల్ సినిమాలు కొనుక్కునే సాహసం బయ్యర్లు చేయకపోవచ్చు అంటూ కామెంట్స్ కూడ వచ్చాయి కానీ అది అంత గతం. అఖిల్ పై ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఒక భారీ యాక్షన్ మూవీని నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనీల్ కుమార్ అనే యంగ్ డైరెక్టర్ ఈమూవీకి దర్శకత్వం వహిస్తాడాని వార్తలు వస్తున్నాయి.



ఇప్పటికే ఈమూవీ స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు పూర్తి కావడంతో త్వరలోనే ఈమూవీ సెట్స్ పైకి వెళుతుంది అని అంటున్నారు. ఈమూవీలో అఖిల్ పక్కన నటించడానికి ముంబాయికి చెందిన ఒక యంగ్ హీరోయిన్ తో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈమూవీకి ‘ధీర’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి రామ్ చరణ్ ను ‘మగధీర’ గా మార్చి అతడిని మెగా పవర్ స్టార్ గా మార్చాడు.



ఇప్పుడు ‘ధీర’ తో అఖిల్ కోరుకున్న బ్లాక్ బష్టర్ హిట్ అతడి సొంతం అయితే దాదాపు 8సంవత్సరాలుగా ఒక్క హిట్ కూడ లేక వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న అఖిల్ కెరియర్ గాడిలో పడే అవకాశం ఉంది. అదే జరిగితే అతడి కెరియర్ గురించి టెన్షన్ పడుతున్న నాగార్జునకు ఊరట లభిస్తుంది. ఎప్పటి నుంచో నాగార్జున అఖిల్ నాగచైతన్య లు ఒక మల్టీ స్టారర్ లో నటిస్తే చూడాలని అక్కినేని అభిమానులు ఆశ పడుతున్నారు. ‘ధీర’ సక్సస్ తో అఖిల్ క్రేజ్ పెరిగితే నాగ్ ఈ మల్టీ స్టారర్ గురించి కూడ ఆలోచించే ఆస్కారం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: