మీడియాతో సన్నిహితంగా ఉండే నాగవంశీ ఈమధ్య ‘అవతార్ 2’ సినిమా మీద విమర్శలు చేసినప్పుడు ఆకామెంట్స్ ఎంతో సంచలనంగా మారాయి. ఈమధ్య తన నిర్మాణంలో వచ్చిన మ్యాడ్ మూవీ ‘జాతిరత్నాలు’ తో పోలిస్తే తక్కువ కామెడీ ఉందని ఈసినిమాను చూసిన ప్రేక్షకులు సరిగ్గా నవ్వలేదని ఎవరైనా భావిస్తే సినిమా టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చి వేస్తానని ఈయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ గా ఈనిర్మాత కన్నడ హిట్ మూవీ ‘సప్తసాగరాలు దాటి’ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఒక మీడియా సంస్థ నిర్వ హించిన చర్చా గోష్టిలో ఈనిర్మాత కలర్స్ స్వాతి శోభు యార్లగడ్డ ప్రియదర్శి తదితరులతో కలిసి పాల్గొన్నాడు. ఈసందర్భంగా కొందరు ‘సప్తసాగరాలు దాటి సైడ్ బి’ సినిమా చూశారా అని అడిగినప్పుడు నాగవంశీ కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేశాడు. తన జీవితంలో ఉన్న డిప్రెషన్లు చాలని మళ్లీ సినిమా చూసి డిప్రెషన్లు తెచ్చుకోవాల్సిన పనిలేదని అంటూ డబ్బులిచ్చి థియేటర్ కు వెళ్ళి డిప్రెషన్ కొని తెచ్చుకోవాల అంటూ జోక్ చేశాడు.
ఇదే సంధర్భంలో కలర్స్ స్వాతి ‘మంత్ ఆఫ్ మధు’ సరిగ్గా ఆడలేదంటే భాధ పుడుతున్నారా అని అడిగినప్పుడు నాగవంశీ ఆసినిమా ఒకేసారి 5సినిమాలతో పోటీ పడటం వల్ల సరిగ్గా ఆడలేకపోయిందని విడిగా ఆ సినిమా విడుదలై ఉంటే ఖచ్చితంగా హిట్ అయిఉండేది అని తన అభిప్రాయాన్ని తెలియచేశాడు. ఇన్ని అంచనాలు ఉన్ ఈ నిర్మాత మహేష్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తీస్తున్న ‘గుంటూరు కారం’ పై ఎలాంటి అంచనాలు పెంచుకున్నాడో ప్రస్తుతానికి సస్పెన్స్..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి