సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఇంకా హాట్ బ్యూటీ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన 'యానిమల్' సినిమా ఇప్పుడు రిలీజ్ కి సిద్దమవుతుంది. డిసెంబర్ 1న ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ అండర్ వరల్డ్ డాన్ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ రిలీజ్ అయ్యి భారీ అంచనాలు క్రియేట్ చేసింది.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు హైదరాబాద్ లోని మల్లా రెడ్డి యూనివర్సిటీలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్ కి రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న ఇంకా బాబీ డియోల్ తో పాటు చీఫ్ గెస్టులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కూడా విచ్చేశారు.ఇక ఈ ఈవెంట్ లో అనిల్ కపూర్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో డాన్స్ వేయించారు.యాంకర్ సుమ అనిల్ కపూర్ ని ఏదైనా ఒక స్టెప్ వేయమని ఆడియన్స్ కోరగా, ఆయన ఓకే చెప్పి మహేష్ బాబు పాటని వేయమని చెప్పారు. అయితే తనతో పాటు డాన్స్ వేయడానికి మహేష్ అండ్ రణబీర్ ని కూడా వేదిక మీదకి రావాలని అనిల్ కపూర్ కోరారు. సూపర్ మహేష్ బాబు గురించి తెలిసిందేగా. ఆయనకు మొహమాటం చాలా ఎక్కువ. అందుకే మొదలో వేదిక మీదకి రావడానికి కొంచెం మొహమాటం చూపించారు.


అయితే అనిల్ కపూర్ వదల్లేదు “నేను ఒక సీనియర్ గా ఆదేశిస్తున్నాను మీరు స్టేజి పైకి రండి” అని చెప్పడంతో సూపర్ స్టార్ మహేష్ వేదిక మీదకి వచ్చారు.ఇక వేదిక పై పోకిరి సినిమాలోని ‘డొలె డొలె’ సాంగ్ ని వేశారు. ఆ పాట హుక్ స్టెప్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు అలా వేసి మైమరపించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, రణబీర్ మహేష్ తో కలిసి కూడా పాటకు ఓ స్టెప్ వేశారు. గతంలో ‘సర్కారు వారి పాట’ మూవీ సక్సెస్ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ డాన్స్ వేసి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇలా వేదిక పై డాన్స్ వేసి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ అంతా కూడా జై బాబు జై బాబు అని అరుస్తూ ఉంటే యానిమల్ టీం ఒక్కసారిగా మహేష్ బాబు క్రేజ్ చూసి షాక్ అయ్యారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయన క్రేజ్ చూసి అనిల్ కపూర్, రణబీర్ కపూర్, బాబీ డియోల్ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా మహేష్ బాబు ఎంట్రీ ఇస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చేసాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ చూసి బాలీవుడ్ ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఈ ఈవెంట్ విజువల్స్ నెట్టింటా బాగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: