ఈవారం విడుదలకాబోతున్న సందీప్ వంగా రణబీర్ కపూర్ ల ‘యానిమల్’ మూవీకి సగటు ప్రేక్షకులలో మ్యానియా బాగా ఏర్పడటంతో ఈమూవీ ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ తో రిలీజ్ అవుతోంది. ఈమూవీకి రిలీజ్ తరువాత ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలక్షన్స్ సునామీ ఖాయం అని అంటున్నారు.ఇంత హైక్ క్రియేట్ చేసుకున్న ఈమూవీ కథ మొట్టమొదటిగా మహేష్ దగ్గరకు వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి. ‘అర్జున్ రెడ్డి’ బ్లాక్ బష్టర్ హిట్ తరువాత సందీప్ వంగా మహేష్ ను కలిసి ఈకథను వినిపించినట్లు టాక్. ఈకథ విషయంలో మహేష్ తన నిర్ణయాన్ని తెలపడం ఆలస్యం అవుతూ ఉండటంతో సందీప్ వంగా ‘అర్జున్ రెడ్డి’ మూవీని ‘కబీర్ సింగ్’ గా బాలీవుడ్ లో రీమేక్ చేయడం అక్కడ అతడి పేరు మారుమ్రోగి పోవడం జరిగిపోయాయి.ఆతరువాత రణబీర్ కపూర్ తో సందీప్ కు ‘యానిమల్’ ప్రాజెక్ట్ సెట్ కావడంతో ఇక మహేష్ తో రాయబారాలు నిలిచి పోయినట్లు టాక్. ఇప్పుడు ఈవార్తలు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న నేపధ్యంలో మహేష్ అబిమానులు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ జూనియర్ లకు పాన్ ఇండియా క్రేజ్ ఏర్పడి పోయింది. ఈలిస్టులో ఒక్క మహేష్ మాత్రమే వెనకపడి ఉన్నాడు.ఇలాంటి పరిస్థితుల మధ్య మహేష్ ధైర్యం చేసి ‘యానిమల్’ మూవీ ప్రాజెక్ట్ కు ఓకె చేసి ఉంటే రాజమౌళి తీయబోయే సినిమాకు ముందే మహేష్ కు ‘యానిమల్’ తో భారీ స్థాయిలో పాన్ ఇండియా ఇమేజ్ ఏర్పడి ఉండేది అన్నఅభిప్రాయం అతడి అభిమానులలో ఉంది. అయితే పూర్తి  వయలెన్స్ తో  కూడుకున్న ‘యానిమల్’ కధకు రణబీర్ కపూర్ స్థాయిలో  మహేష్ నటించి మెప్పించగలడా అన్నసందేహాలు కూడ కొందరికి  ఉన్నాయి. దీనికితోడు ఈమధ్య మహేష్ నటిస్తున్న సినిమాల కధలు ఒకే తీరులో ఉండటంతో తమ హీరో ధైర్యంచేసి ‘యానిమాల్’ కు ఓకె చేసి  ఉంటే బాగుండేది అన్నది అభిమానుల అభిప్రాయం..  

 


మరింత సమాచారం తెలుసుకోండి: