తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న నటులలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో ఎక్కువ శాతం మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ సూపర్ క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటికే నాని ఈ సంవత్సరం ప్రారంభంలో దసరా అనే సినిమాలో హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

మూవీ తెలుగు , తమిళ  , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో నాని కి ఈ మూవీ ద్వారా ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా నాని "హాయ్ నాన్న" అనే సినిమాలో హీరోగా నటించాడు.  ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... సౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

 ఇకపోతే ఈ మూవీ నిన్న అనగా డిసెంబర్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ లభించడంతో ఫస్ట్ డే ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వరల్డ్ వైడ్ గా దక్కాయి. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన డిజిటల్ హక్కులను ఈ మూవీ బృందం వారు అమ్మి వేసినట్లు తెలుస్తోంది.  ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు భారీ దరకు దక్కించుకున్నట్లు ... అందులో భాగంగా ఈ సినిమాను కొన్ని రోజుల థియేటర్ రన్ పూర్తి అయిన తర్వాత నెట్ ఫిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానునట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: