యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ 1 సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేయలేకపోయినా పర్వాలేదు అనిపించింది. 600 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద పెర్ఫార్మన్స్ చేయకపోయినా ఫ్యాన్స్ కి మాత్రం బాగా నచ్చింది.ఇక సలార్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాసే విధంగా ఎదురు చూశారు అనడంలో సందేహం లేదు.కాస్త ఆలస్యంగా ఫేమస్ ఓటీటీ అయిన నెట్‌ ఫ్లిక్స్ లో సలార్ సినిమాను స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత అంటే ఈ మధ్య డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సలార్‌ సినిమా హిందీ వర్షన్‌ స్ట్రీమింగ్‌ మొదలు అయ్యింది. అయితే నెట్‌ ఫ్లిక్స్ తో పోల్చితే డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ కి ఇండియాలో ఖాతాదారులు ఎక్కువ మంది ఉంటారు అనేది ఒక అంచనా.


అందుకే సలార్‌ సినిమా హిందీ వర్షన్‌ ను డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో పెద్ద ఎత్తున చూసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్లే సలార్ స్ట్రీమింగ్‌ ను డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ వారు పెద్ద ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు.తాజాగా సలార్‌ స్ట్రీమింగ్ విషయాన్ని ప్రభాస్‌ తో కూడా బైట్ చేయించారు. సలార్‌ హిందీ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో అంటూ ప్రభాస్ చెప్పిన వీడియోను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ వారు షేర్ చేశారు. మొత్తానికి ప్రభాస్‌ తో సలార్ హిందీ వర్షన్‌ డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ లో స్ట్రీమింగ్‌ అవుతుందని అప్డేట్ ఇవ్వడం ద్వారా మరింత మందికి ఈ సినిమాను తీసుకు వెళ్లడం లో సఫలం అయ్యారని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఎడి సినిమా షూటింగులో బాగా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: