యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమా 2024 వేసవి విడుదల లక్ష్యంగా వస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ వంటి నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.ఈ మూవీ మే 9న భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. కల్కి 2898 ఏడి ఇంకా కొన్ని రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ప్రభాస్ - దిశా పటాని ఇటీవల రొమాంటిక్ సాంగ్ షూటింగులో పాల్గొన్నారని కథనాలొచ్చాయి. ఈ సినిమా షూటింగ్ కోసం వీరు ఇద్దరు హైదరాబాద్‌లో ఉన్నారని సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు, డబ్బింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే కొంతమంది ఆర్టిస్టులు తమ పార్ట్‌లకు డబ్బింగ్ కూడా చెబుతున్నారు. అయితే మే 2024 గడువును చేరుకోవడానికి టీమ్‌కి చాలా కష్టమయ్యే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది.ఎందుకంటే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.


నాగ్ అశ్విన్ పనిని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం కోరుతున్నారట.అలాగే టీమ్ ప్రొడక్ట్‌పై విపరీతంగా ఖర్చు పెట్టింది. అందుకే వారు సినిమాను గజిబిజిగా విడుదల చేయడానికి తొందరపడటం లేదు.కల్కి 2898 AD సినిమా చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణం అంతా షూటింగ్‌లో పాల్గొంటోంది. త్వరలో కొత్త విడుదల తేదీని కన్ఫర్మ్ చేసి మేకర్స్ మరో ప్రకటన చేయనున్నారని కూడా సమాచారం వినిపిస్తోంది. ఈ మూవీ మేకర్స్ కూడా ఇటీవలే అన్ని ఒప్పందాలను ముగించారు.థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ ఇంకా ఓటీటీ రూపంలో నిర్మాతలు బడ్జెట్‌లో ఎక్కువ భాగాన్ని తిరిగి పొందారని కథనాలొస్తున్నాయి. యాక్షన్‌తో కూడిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇండియాలో సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయనుందని అంచనా వేస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనిదత్ ఈ మూవీ కోసం ఏకంగా 600కోట్ల బడ్జెట్ పెడుతున్నారని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: