ప్రముఖ మీడియా సంస్థలలో ఒకటి అయినటువంటి ఆర్మాక్స్ సంస్థ తాజాగా ఫిబ్రవరి నెలకు గాను టాలీవుడ్ టాప్ హీరోయిన్ లు ఎవరు అనే విషయంపై ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ఫిబ్రవరి నెలకు గాను టాలీవుడ్ టాప్ 10 బ్యూటీ లు ఎవరు అనేది తెలుసుకుందాం.

మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత ఫిబ్రవరి నెలలో గాను మొదటి స్థానంలో నిలిచింది. ఈ బ్యూటీ ఆఖరుగా ఖుషి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత సీనియర్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి కాజల్ అగర్వాల్ రెండవ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం కాజల్ సత్యభామ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల 3 వ స్థానంలో నిలవగా ... సాయి పల్లవి 4 వ స్థానంలోనూ ... అనుష్క శెట్టి 5 వ స్థానంలోనూ నిలిచింది. రష్మిక మందన 6 వ స్థానంలోనూ నిలిచింది.


బ్యూటీ ప్రస్తుతం "పుష్ప పార్ట్ 2" మూవీలోను అలాగే మరికొన్ని సినిమాల్లో నటిస్తుంది. ఇక ఆ తర్వాత మిల్క్ బ్యూటీ తమన్నా 7 వ స్థానం లోనూ ... కీర్తి సురేష్ 8 వ స్థానం లోనూ ... పూజ హెగ్డే 9 వ స్థానం లోనూ ... అనుపమ పరమేశ్వరన్ 10 వ స్థానం లోను నిలిచింది. ఇకపోతే ఫిబ్రవరి నెలకు గాను ఆర్మ్యాక్స్ మీడియా సంస్థ విడుదల చేసిన లిస్ట్ లో ఉన్న ఈ పది మంది నటీ మణులు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ క్రేజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్నారు. ఇందులో అందరి కంటే కూడా ఎక్కువ సినిమాలలో నటిస్తూ యంగ్ బ్యూటీ శ్రీ లీల ఫుల్ జోష్ ను చూపిస్తూ ఉండగా ... మిగతా బ్యూటీ లు ఒకటి , రెండు సినిమాలలో నటిస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: