మ్యాచో స్టార్ గోపీచంద్ హీరో గా ప్రియ భవాని శంకర్ , మాళవిక మోహన్ హీరోయిన్ లుగా హర్ష దర్శకత్వంలో రూపొందిన బీమా అనే సినిమా ఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 8 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 8 రోజుల్లో నైజాం ఏరియాలో 2.53 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 1.05 కోటి ... ఏపీ లో 2.83 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8 రోజుల్లో 6.41 కోట్ల షేర్ ... 10.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 65 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 7.06 కోట్ల షేర్ ... 12.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 11.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ మరో 4.94 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: