టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి పరుశు రామ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మృనాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ ప్రమోషన్ లను ఈ మొదలు పెట్టింది. 

అందులో భాగంగా ఈ సినిమా నుండి ఇప్పటికే కొన్ని పాటలను మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క ట్రైలర్ ను మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం ప్రకటించింది.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ను మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు అలాగే ఈ ట్రైలర్ విడుదలకు సంబంధించిన సెలబ్రేషన్స్ ను హైదరాబాద్ ... శ్రీరాములు థియేటర్ ... మూసాపేట్ లో ఉదయం 10 గంటలకు , తిరుపతి "పి జి ఆర్" సినిమాస్ థియేటర్ లో సాయంత్రం 6 గంటలకు మొదలు కానున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విజయ్ , పరశురామ్ కాంబో లో "గీత గోవిందం" మూవీ రూపొంది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. వీరి కాంబోలో రూపొందుతున్న రెండవ సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: