ఈలోగా త్రిష లాంటి వారు నయనతారని దాటేసి ముందుకెళ్తున్నారు. ఐతే నయనతార ఇప్పుడు ఎక్కడ నుంచి ఛాన్స్ వచ్చినా చేయాలని అనుకుంటుంది. ఇదివరకు తను కాదన్న టాలీవుడ్ వైపు కూడా అమ్మడు ఆశగా చూస్తుందని టాక్. నయనతార ఒక రేంజ్ లో ఫాం లో ఉన్నప్పుడు తెలుగు సినిమా ఆఫర్ వస్తే చాలు ఆమె కొండెక్కి కూర్చునేది. అడిగినంత ఇస్తేనే సినిమా చేస్తానని డిమాండ్ చేసేది. అయితే వాటికి అడ్జెస్ట్ అయ్యి కొందరు ఆమెతో సినిమాలు చేశారు.
ఐతే మధ్యలో కొన్ని సినిమా ఆఫర్లు వచ్చినా టాలీవుడ్ ని అసలు పట్టించుకోలేదు నయనతార. అదే ఇప్పుడు ఆమెకు శాపంగా మారింది. నయనతార తెలుగు నుంచి ఆఫర్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలన్నీ పాన్ ఇండియా వైడ్ గా అదరగొట్టేస్తున్నాయి. అందుకే నయన్ కూడా ఇక్కడ సినిమాలు చేయాలని చూస్తుంది. కానీ మన మేకర్స్ మాత్రం ఆమెను కాదనుకుంటున్నారు. అవకాశం ఇచ్చినప్పుడు కాదంటే ఇలాంటి పరిస్థితే వస్తుందని చెప్పుకుంటున్నారు. ఐతే ఎలాగైనా సరే మళ్లీ తెలుగులో ఒక భారీ ఆఫర్ కొట్టేయాలని నయన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. జవాన్ తో బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ కొట్టిన నయనతార కచ్చితంగా తెలుగులో త్వరలోనే ఒక మంచి ఛాన్స్ అందుకుంటే చూడాలని ఉందని అంటున్నారు ఆమె తెలుగు ఫ్యాన్స్.