చాలా మంది సెలబ్రిటీలు వివాహమైన తర్వాత అభిమానులతో టచ్ లో ఉండడానికి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. మరి కొంత మంది అభిమానులే వెతికి మరి వారి గురించి కొన్ని విషయాలు వైరల్ గా చేస్తూ ఉంటారు. 2017లో మా అబ్బాయి అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ చిత్ర శుక్ల.. ఆ తర్వాత రంగుల రత్నం, సిల్లీ ఫెలోస్, మస్తు సేడ్స్ ఉన్నాయిరా, ఉనికి తదితర చిత్రాలలో నటించి మంచి సంపాదించుకుంది హీరోయిన్ చిత్రా శుక్ల.


 ఈ హీరోయిన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ గత ఏడాది డిసెంబర్లో ఒక పోలీస్(వైభవ్ఉపాధ్యాయ) అధికారిని ప్రేమించి మరి వివాహం చేసుకున్నది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉన్నది. తాజాగా చిత్ర శుక్ల తల్లి అయినట్టుగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేసింది. సెప్టెంబర్ 30వ తేదీన 9:31 నిమిషాలకు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లుగా తెలియజేసింది చిత్ర శుక్ల.. అయితే ఇది తమ వివాహ ముహూర్తం అంటూ మా బాబుకు కూడా అదే ముహూర్తానికి పుట్టాడు అంటూ చాలా ఆనందంగా తెలియజేసింది.


ఈ ఆనందం తనకు కలలాగా అనిపిస్తుంది అంటూ తెలిపింది. పోలీస్ అధికారి కుటుంబంలోకి తర్వాతి తరం వచ్చేసిందని.. అయితే తన భర్త వైభవ్ ఉపాధ్యాయ ఎన్నో సమస్యలతో ఎన్నో రకాల కష్టాలను కుటుంబ సభ్యులు అనుభవించారని కానీ ఇప్పుడు ఆ దేవుడు ఆశీర్వదించాడు అన్ని బాధలను తొలగించారు అంటూ తెలియజేసింది. అంతేకాకుండా తన బాబు ఫోటోలను కూడా షేర్ చేసింది చిత్ర శుక్ల. అందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతూ ఉండగా ఈ ఫోటోలు చూసిన అభిమానులు నెటిజెన్స్ సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ తన కుమారుడు చాలా క్యూట్ గా ఉన్నారంటూ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: