టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది యాక్టర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందచందాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో నటి అషు రెడ్డి ఒకరు. ఈ చిన్నది జూనియర్ సమంతగా గుర్తింపు దక్కించుకుంది. అషు రెడ్డి సేమ్ సమంత లానే ఉంటుందని చాలామంది కామెంట్లు చేస్తూ ఉంటారు. కాగా, ఈ చిన్నది వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. అనంతరం కొన్ని సినిమాలలోను కీలక పాత్రలలో నటించి ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది.



ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక అషు రెడ్డి పలు షోలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తన అంద చందాలతో హోస్టింగ్ స్టైల్ తో మంచి మంచి అవకాశాలను అందుకుంటుంది. కాగా, ఈ చిన్నది టీవీ షోకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా తనకు సంబంధించిన అన్ని విషయాలను ఆ షో వేదికగా షేర్ చేసుకున్నారు. అందులో భాగంగానే తాను గతంలో చేసిన ఓ ఇంటర్వ్యూ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అషు రెడ్డి వెల్లడించింది.

గతంలో ఆర్జీవితో కలిసి చేసిన ఇంటర్వ్యూ తనకు చాలా చెడ్డ పేరు తెచ్చిందని, తన వల్ల కుటుంబ సభ్యులు కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చినట్లుగా అషు రెడ్డి వెల్లడించింది. ఈ సమయంలోనే అషు రెడ్డి తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లుగా వెల్లడించింది. తన బ్రెయిన్ లో పెద్ద సైజులో ట్యూమర్ ఉందని చెప్పింది. ఆ ట్యూమర్ తీసేయడానికి తనకు అర గుండు తీసి సర్జరీ చేసి ట్యూమర్ తీసేసినట్లుగా అషు రెడ్డి వెల్లడించారు. ఆ తర్వాత హెయిర్ రావడానికి తాను చాలా ఇబ్బందులు పడిందట. అయినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా హెయిర్ క్లిప్ తో ఎప్పటిలానే మళ్లీ యాక్టింగ్ ప్రారంభించాలని అషు రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పింది. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో హాట్ గా ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ అవి షేర్ చేసుకోగా విపరీతంగా వైరల్ అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: