Chaurya Paatam review : దొంగతనం నేపథ్యంలో కామెడీని జోడించి సినిమాలు చాలానే వచ్చాయి కానీ.. ‘చౌర్యపాఠం’ చిత్రం మాత్రం సరికొత్త కథకు బీజం వేశారు. దర్శకుడు నిఖిల్ గొల్లమూరి తన మొదటి సినిమాకి దర్శకత్వం వహించిన ఆసక్తికరమైన కథాంశాన్ని ఎంచుకొని, ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఉత్కంఠపరిచేల ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారడం ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది.

కథ విషయానికొస్తే.. సినిమా తీయాలని ఓ యువకుడు కలలు కంటూ ఉంటారు. తన దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో దొంగతనం  చేస్తూ డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ధనపల్లి అనే గ్రామంలో  ఉండేటువంటి ఒక బ్యాంకును దోచుకోవాలని భావించి ఒక ముఠాను ఏర్పాటు చేసిన ప్రణాళికలు వేస్తారు. ఈ దొంగతనాల క్రమంలో వీరికి ఎదురయ్యే అనుభవాలు, ఊహించని పరిణామాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. ముఖ్యంగా టన్నెల్‌లో జరిగే దొంగతనం  చేసేటువంటి సన్నివేశం చాలా కొత్తగా, కామెడీగా కూడా ఉంటుందని చిత్ర బృందం చెప్పడంతో సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తిని పెంచేసింది.బ్యాంకు ఉద్యోగి అయిన హీరోయిన్ అనుకోకుండా దొంగల ముఠా ఈ చిత్ర కథకు మరింత ట్విస్ట్ అని చెప్పవచ్చు.


నటీనటుల  పర్ఫామెన్స్:
హీరోగా పరిచయమవుతున్న ఇంద్రరామ్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు, హీరో నటన , డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉన్నాయి. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బ్యాంకు ఉద్యోగిగా, ఆ తర్వాత దొంగల ముఠాలో సభ్యురాలిగా చేరడం వంటివి చాలా విభిన్నమైన పాత్రలో మెప్పించింది. సీనియర్ నటుడు రాజీవ్ కనకాల గ్రామ పెద్దగా తన నటనతో మెప్పించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక అంశాలు
Dop కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అద్భుతంగా చేశారు. గ్రామీణ వాతావరణాన్ని, టన్నెల్ సన్నివేశాలను తన కెమెరా పనితనంతో అద్భుతంగా తెరకెక్కించారు. డేవ్ అందించిన సంగీతం సినిమా కు  బాగానే కలిసి వచ్చింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి, ఎక్కడా రాజీ పడకుండా  సినిమా తెరకెక్కించినట్లుగా ఈ చిత్రాన్ని చూస్తే కనిపిస్తోంది.


సినిమా ఎలా ఉందంటే
 ‘చౌర్యపాఠం’ కేవలం  హాస్య కథాచిత్రమే కాకుండా ఇందులో సన్సెన్స్ కామెడీతో పాటు ప్రేక్షకులను థ్రిల్లింగ్  గురిచేసేలా అంశాలు కూడా ఉన్నాయి. దొంగతనం చేసే ప్రయత్నంలో ఎదురయ్యే హాస్య సన్నివేశాలు ప్రేక్షకుల చేత కడుపుబ్బ నవ్విస్తు ,ఊహించని మలుపులతో చౌర్యపాఠం చిత్రం ప్రేక్షకులను ఉత్కంఠను కలిగిస్తున్నది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్‌లు  ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. దొంగతనం చేయాలనుకునే వారికి చౌర్యపాఠం సినిమా ఒక పాఠంలాంటిదని నిర్మాత చెప్పడం సినిమా ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తుంది.

ఫైనల్ గా
 ‘చౌర్యపాఠం’ చిత్రం వినోదంతో పాటు, క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం. కొత్త నటీనటులు, ఆసక్తికరమైన కథాంశం, చక్కటి హాస్యం, థ్రిల్లింగ్ అంశాలు ఈ సినిమాను తప్పకుండా చూడదగ్గ చిత్రంగా ఆకట్టుకుంటున్నా . ఈ నెల 25న విడుదల అయినా ఈ చిత్రం  అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది.

రేటింగ్: 2.7/5

మరింత సమాచారం తెలుసుకోండి: