
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత తన కొత్త సినిమాని తమిళ క్రేజీ హీరో విజయ్ సేతుపతి హీరోగా పూరి ప్రకటించాడు. ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ టబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో యంగ్ బ్యూటీ కూడా నటించబోతోంది. ఈ సినిమాలో మరో యంగ్ బ్యూటీ కూడా నటించబోతుంది. ఆమె ఎవరో కాదు ఎన్టీఆర్ జై లవకుశ భామ .. టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్. నివేద ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఆమె విజయ్ సేతుపతికి భార్య పాత్రలో నటిస్తోందని ... ఆమె పాత్ర కూడా చాలా విభిన్నంగా
ఉంటుందని సమాచారం.
ఇక ఈ సినిమా లో పాత్రలు అన్నీ కూడా చాలా వేరియేషన్లలో సాగుతాయట. ఏదేమైనా ఈ సారి హిట్ కొట్టాలన్న కసితో పూరి ఈ సారి కొత్తగా ట్రై చేస్తున్నాడు అంటున్నారు. అన్నట్టు జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. పూరి డైరెక్షన్ లో యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన “ డబుల్ ఇస్మార్ట్ ” ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. అంతకు ముందు లైగర్ కూడా పెద్ద డిజాస్టర్. ఇప్పటికే పూరి పనై పోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ సారి పూరి హిట్ కొట్టకపోతే ఇక పూరిని నమ్మే వాళ్లే ఎవ్వరూ ఉండరు.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.
నోట్ : వ్యక్తిగత, కుటుంబ సమస్యలు వద్దు