పూజ హెగ్డే నిన్న మొన్నటి వరకు అసలు ఇండస్ట్రీలో సెటిల్ అవుతుందా..? అవ్వలేదా..? అన్న అయోమయంలో ఉన్న హీరోయిన్ . రాత్రికి రాత్రి ఏదో మ్యాజిక్ జరిగినట్లు ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు  సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అందులో రెండు తెలుగు సినిమాలు కావడం గమనార్హం . కాగా సూర్య తో నటించిన "రెట్రో" సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది . ఈ సినిమాతో క్రేజీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటుంది పూజ హెగ్డే అంటూ చాలామంది సినీ ప్రముఖుల అభిప్రాయపడుతున్నారు . రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ లుక్స్ పూజా హెగ్డే కు పాజిటివ్ గానే ఉంది .


అయితే పూజా హెగ్డే ఎందుకు ఇన్నాళ్లు మంచి ఆఫర్స్ తన ఖాతాలో వేసుకోలేకపోయింది అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్..? గా మిగిలింది. గతంలో పెద్దపెద్ద స్టార్స్ తో నటించి ఆమె మంచి హిట్స్ అందుకుందిగా.. మరి ఎందుకు ఆమె స్ట్రాటజీలను టఫ్ సిచ్యూవేషన్ టైంలో ఉపయోగించలేదు అంటే మాత్రం.. చాలామంది పూజ హెగ్డే కి ఉన్న పిచ్చి గురించే మాట్లాడుకుంటున్నారు . నిజానికి పూజ హెగ్డే చాలా చిలౌట్ అయ్యే టైప్ .. సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవాలి అంటూ పాకులాడదు .. వచ్చిన అవకాశాలను మాత్రమే చేస్తుంది .



వేరే డైరెక్టర్ ల దగ్గరికి వెళ్లి ఆఫర్ ఇవ్వండి ఆఫర్ ఇవ్వండి అంటూ బ్రతిమిలాడే టైప్ అయిన హీరోయిన్ పూజ హెగ్డే కానే కాదు . తన సొంత కాళ్ళ మీద నిలబడే టైప్ . సినిమాలు కాకపోతే మరొక ఫీల్డ్ .. ఏ మార్గం అయితే ఏం నిజాయితీగా డబ్బు సంపాదించుకుంటే చాలు అనే టైప్..  నీతి నిజాయితీ అనే పిచ్చి కొంచెం పూజ హెగ్డే కి ఎక్కువగానే ఉంది అని .. ఆ కారణంగానే ఇన్నాళ్లు ఆమె సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడానికి నాన్న తంటాలు పడిందని..  ఇప్పుడు పూజ హెగ్డే కి సూర్య ఛాన్స్ ఇవ్వడంతో మిగతా హీరోలు కూడా ఆమె వెనకే పడుతున్నారు అని మాట్లాడుకుంటున్నారు జనాలు.  మొత్తానికి పూజ హెగ్డే ఈజ్ బ్యాక్ బుట్ట బొమ్మ మళ్ళీ తన అందంతో అదరగొట్టేస్తుంది..  చూద్దాం మరి ఈ ముచ్చట ఎన్ని రోజులో.. ఇండస్ట్రీలో కొనసాగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: