
నేను బ్యాంకాక్ కు స్టంట్ షో చేయడానికి వెళ్లానని అప్పుడే నేను స్వప్న దత్ కు చెప్పానని నేను ఉదయం లేవకపోతే నా పని అయిపోయినట్టే అని అన్నానని ముమైత్ ఖాన్ చెప్పుకొచ్చారు. నా పరిస్థితి అంత దారుణంగా ఉండేదని నా ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకోవడానికి అంత సమయం పట్టిందని ముమైత్ ఖాన్ కామెంట్లు చేశారు. ముమైత్ ఖాన్ ఒక రోజు తన ఇంట్లోనే కాలు జారి కింద పడింది.
ఆ సమయంలో తల మంచం అంచుకు బలంగా తగలడంతో మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతోందని వైద్యులు గుర్తించారు. దాదాపుగా 15 రోజుల పాటు ముమైత్ ఖాన్ కోమాలో ఉన్నారు. ముమైత్ ఖాన్ తాజాగా షోఒలో ఈ విషయాలను చెప్పుకొచ్చరు. ముమైత్ ఖాన్ భవిష్యత్తులో కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తారేమో చూడాలి.
ముమైత్ ఖాన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉంది. ముమైత్ ఖాన్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. ముమైత్ ఖాన్ చేసిన స్థాయిలో ఎక్కువ సంఖ్యలో ఐటమ్ సాంగ్స్ ఎవరూ చేయలేదని చెప్పవచ్చు. ముమైత్ ఖాన్ వయస్సు 39 సంవత్సరాలు కాగా చిన్న వయస్సులోనే ఆమె కెరీర్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ముమైత్ ఖాన్ కు సినిమాలలో ఆఫర్లు రాని పక్షంలో ఆమె సీరియళ్లపై దృష్టి పెడితే మంచిది.