పహల్ గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్, భారతదేశం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా శత్రుత్వం ఏర్పడింది. అయితే ముందు నుండి ఇదే శత్రుత్వం ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఇది మరీ తీవ్రతరం అవుతూ ఉంటుంది.పాకిస్తాన్ ఎప్పుడు భారతదేశంపై కవ్వింపు చర్యలు చేస్తూ భారత్ ని కెలుకుతూ ఉంటుంది.కానీ భారత సైన్యం ఎప్పటికప్పుడు పాకిస్తాన్ చర్యలను తిప్పికొడుతూ ఉంటారు. అయితే తాజాగా జరిగిన పహల్ గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ పై కయ్యానికి కాలు దువ్వారు ఇండియన్ ఆర్మీ.. ఈ విషయం పక్కన పెడితే పాకిస్తానీలు వెంటనే భారతదేశం వదిలి వెళ్లిపోవాలి అని ఇండియన్ గవర్నమెంట్ ఆదేశించడంతో ఎంతోమంది పాకిస్తానీలు దేశం వదిలి వెళ్లిపోతున్నారు. అంతేకాదు ఇండియన్ గవర్నమెంట్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది.

అయితే ఇరుదేశాల మధ్య గొడవ జరుగుతున్న వేళ తాజాగా మహేష్ బాబు కొడుకు పాకిస్తాన్ అమ్మాయితో తిరుగుతూ వివాదంలో ఇరుక్కున్నారు. మరి ఇంతకీ ఆ విషయం ఏంటయ్యా అంటే.. విదేశాల్లో చదువుకుంటున్న మహేష్ బాబు కొడుకు గౌతమ్ అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసిన వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా మహేష్ బాబు కొడుకు గౌతమ్ కి సంబంధించి ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మహేష్ బాబు ఇండియన్స్ క్రికెటర్ల జెర్సీ ని వేసుకొని కనిపించగా ఆయన పక్కనే ఉన్న మరొక అమ్మాయి పాకిస్తాన్ జెర్సీ వేసుకొని కనిపించింది. 

అయితే వీరిద్దరూ ఎంతో నవ్వుకుంటూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఉన్న వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో ఇది క్యూట్ వీడియో కానీ ఇండియా కి పాకిస్తాన్ కి మధ్య గొడవలు జరుగుతున్న వేళ ఇది వివాదంలో ఇరుక్కుంటుంది.. ఇప్పుడు ఇలాంటి వీడియోలు షేర్ చేయడం అవసరమా అంటూ మహేష్ బాబు కొడుకు గౌతమ్ పై కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొంతమంది అయితే నీకు తిరగడానికి ఎవరూ దొరకలేదా..పాకిస్తాన్ అమ్మాయే దొరికిందా..ఓ పక్క రెండు దేశాలు కొట్టుకొని చచ్చిపోతుంటే నీకు మాత్రం పాకిస్తాన్ అమ్మాయి కావాల్సి వచ్చిందా అంటూ మహేష్ బాబు కొడుకు పై షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ తో అయినా గౌతమ్ ఆ వీడియో డిలీట్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: