
ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా క్యామియో పాత్రలో నటించబోతున్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన అయితే వేలుబడలేదు. కానీ తమిళ మీడియా వర్గాల నుంచి ఎక్కువగా ఇది వినిపిస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా రూ .50 కోట్ల రూపాయల వరకు బాలయ్య తీసుకుంటున్నారనే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే బాలయ్య ఇప్పటివరకు ఇంతటి రెమ్యూనరేషన్ అందుకున్న సందర్భాలే లేవు. ఇందులో బాలకృష్ణ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
కేవలం 20 నిమిషాలు మాత్రమే బాలయ్య ఇందులో కనిపించబోతున్నారట.ఈ పాత్ర కోసం ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని రజనీకాంత్ స్టైల్ కి బాలయ్య మాస్ తోడైతే కచ్చితంగా ఈ సినిమా మరొక లెవెల్ లో ఉంటుందని అభిమానులు తెలియజేస్తున్నారు. అలాగే బాలయ్య తో పాటు మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ కూడా ఈ సినిమా లో నటిస్తు ఉన్నారు. ఈ సినిమా కూడా యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించే విధంగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమా అంచనాలను పెంచేశాయి కచ్చితంగా ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్లో చేరుతుందని అంచనాలు ఉన్నాయి.