కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటి సంపాదించుకున్న విశాల్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ అవుతున్నాయో వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే వస్తున్నాం. మరీ ముఖ్యంగా హీరో విశాల్  ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి . కాగా  ఈ స్టార్ హీరో ఎక్కువగా షూటింగ్స్ లో గాయపడుతూ ఉంటారు అని .. ఆయన ఆరోగ్యం అస్సలు బాగాలేదు అని..  కోలీవుడ్ మీడియాలో ఎన్నోసార్లు వార్తలు వినిపించాయి . తాజాగా విశాల్ ఒక కార్యక్రమంలో స్పృహ తప్పి పడిపోయాడు ..దానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

విశాల్ విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . అదే సమయంలో వేదికపై అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే సిబ్బంది ఆయన ని హాస్పిటల్ కి తీసుకెళ్ళి చికిత్స అందించి ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని అభిమానులకు తెలియజేశారు . "విశాల్ ఆరోగ్యం బాగానే ఉంది అని సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం కారణంగా కళ్ళు తిరిగి పడిపోయారు " అంటూ చెప్పుకొచ్చారు టీం . అరగంట విశ్రాంతి తర్వాత విశాల్ మళ్ళీ కార్యక్రమంలో పాల్గొనే అంత యాక్టీవ్ అయ్యారు.

దీనిపై విశాల్ మేనేజర్ క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం విశాల్ కి సంబంధించి రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.  విశాల్ కి భయంకరమైన జబ్బు ఉందని .. త్వరలోనే విశాల్ చనిపోతున్నాడు అని విశాల్ హెల్త్ అస్సలు బాగోలేదు అని .. ఆయన గతంలో తన హెల్త్ పట్ల నిర్లక్ష్యం చేసిన కారణంగానే విశాల్ హెల్త్ ఇలా పాడైపోయింది అని సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఆయన పై జరుగుతుంది. విశాల్  ఆరోగ్యం పై చాలామంది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్న కానీ విశాల్ పరిస్థితి చూసి ఆయనకు నిజంగానే ఏదో జబ్బు ఉన్నట్లు ఉంది అని అది వాళ్ళ టీం దాచేస్తుంది అని మాట్లాడుకుంటున్నారు జనాలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: