టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడి అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే సాయి సూర్య డెవలపర్స్ కేసులో మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య గ్రూప్స్ కంపెనీ ప్రమోషన్స్ కోసం మహేష్ బాబు 5.90 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపణలు నేపథ్యంలో ఈడీ అధికారులు మహేష్ బాబుకు నోటీసులు అందించారు. ఏప్రిల్ 22న ఈడి అధికారులు ఈ నోటీసులను జారీ చేశారు. ఏప్రిల్ 28న విచారణకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత తాను విచారణలకు రాలేకపోతున్నాను అంటూ ఒక లేఖను కూడా రాయడం జరిగింది.

మహేష్ బాబు ఈ రోజున ఈడి విచారణకు హాజరు కావాల్సి ఉండగా సూర్య డెవలపర్ కేసులో విచారణ కొనసాగుతూ ఉన్నది. గతంలో షూటింగ్ వల్ల రాలేకపోయినా మహేష్ బాబు మెయిల్ ద్వారా ఈడి అధికారులకు సమాచారాన్ని కూడా అందించారు. అయితే అనుకున్న తేదీకి రాకపోతే మరొక తేదీకి ఈడీ అధికారులు సూచించారు.. అయితే ఈ రోజున మహేష్ బాబు విచారణకు హాజరు అవుతారా లేకపోతే ఎలా అన్నది అభిమానుల ఆందోళన కలిగిస్తున్న విషయం.


సూర్య డెవలపర్ ప్రమోషన్స్ కోసం మహేష్ బాబు 5.90 కోట్లు రూపాయలు తీసుకున్నారని అయితే ఇందులో 3.4 కోట్ల రూపాయలు నగదు కాగా..2.5 కోట్ల రూపాయలు RTGS ద్వారా తీసుకున్నట్లుగా తెలియజేశారు ఈ కేసులో విచారణకు రావాలి అంటే నోటీసులను పంపించారు మరి ఈ కేసు ఏం జరుగుతుందో అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతున్నది. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో SSMB 29 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ఇలాంటి సమయంలోనే ఇలా ఈడి విచారణకు పిలవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మరి ఈ కేసు విషయంలో మహేష్ బాబు ఏ విధంగా బయటపడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: