కోలీవుడ్ నటుడు విశాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విశాల్ ఇప్పటికే ఎన్నో తమిళ సినిమాలలో నటించి అందులో చాలా మూవీలలో మంచి విజయాలను అందుకొని తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇకపోతే విశాల్ నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలు సాధించడంతో విశాల్ కి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఉంది.

ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల క్రితం విశాల్ , సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన మద గజ రాజా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అంజలి ,వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ని కొంత కాలం క్రితం థియేటర్లలో విడుదల చేశారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా విశాల్ ఓ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఆ ఈవెంట్లో చాలా సేపు ఉన్న విశాల్ ఒక్క సారిగా స్పృహ తప్పి పడిపోయాడు. దానితో విశాల్ కి ఏమయిందా అని అనేక మంది కంగారు పడ్డారు. ఇకపోతే తాజాగా విశాల్ మేనేజర్ విశాల్ ఎందుకు అలా ఒక్క సారిగా స్పృహ తప్పి పడిపోయాడు అనే విషయం గురించి చెప్పుకొచ్చాడు.

విశాల్ తప్పి పడిపోవడం గురించి విశాల్ మేనేజర్ మాట్లాడుతూ ... మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వలన ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి విశాల్ కి తరలించగా వైద్యులు చికిత్స అందించినట్లు కూడా చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సురక్షితంగా ఉంది అని , సమయానికి ఆహారం తీసుకోవాలి అని డాక్టర్లు సూచించినట్లు విశాల్ మేనేజర్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: